ఇది కదా మ్యాచ్ అంటే… వరల్డ్ కప్ కు అసలైన జోష్…!

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా - అప్ఘనిస్తాన్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఆఖరి వరకూ టెన్షన్ పుట్టించిన ఈ మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్ విజయం సాధించింది.

Post Published By: dialnews
Updated : 12 February 2026, 1:00 PM IST

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా - అప్ఘనిస్తాన్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఆఖరి వరకూ టెన్షన్ పుట్టించిన ఈ మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్ విజయం సాధించింది. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో నూర్ అహ్మద్ సిక్సర్లతో అప్ఘనిస్తాన్‌కు విజయాన్ని అందించాడు. లాస్ట్ ఓవర్ మొదటి బంతికే అవుటైనా అది నో బాల్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అదే ఓవర్‌లో రబాడా మరో నో బాల్ వేయడం, ఆ వెంటనే రనౌట్ అవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దాంతో సూపర్ ఓవర్ తప్పలేదు. మొదట బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కాస్త తడబడినా క్వింటన్ డికాక్ - ర్యాన్ రికెల్టన్ ఇద్దరూ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 61 బంతుల్లోనే 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు.

సఫారీల స్కోర్ ఈజీగా 200 దాటుతుందని అనుకున్న సమయంలో ఆఫ్ఘన్ బౌలర్లు పుంజుకుని వికెట్లు తీశారు.ఖర్లో మార్కో యాన్సన్ 7 బంతుల్లో 16 పరుగులు బాదడంతో సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది.సౌతాఫ్రికా ఇచ్చిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అప్ఘనిస్తాన్ జట్టు పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. గుల్బదీన్ నాయబ్, సెడీకుల్లా అటల్ డకౌట్లు కావడంతో 52 పరుగులకే అప్ఘన్ మూడు వికెట్లు కోల్పోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. సఫారీ బౌలర్లు ఊచకోత కోశాడు. 42 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేసి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

అజ్మతుల్లా ఒమర్జాయ్ 17 బంతుల్లో 22, రషీద్ ఖాన్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి ఆఖర్లో పోరాడారు. ఆఖర్లో నూర్ అహ్మద్ సిక్సర్ 9 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేయడం.. ఆఖరి ఓవర్‌లో రెండు నో బాల్స్ రావడంతో మ్యాచ్ అప్ఘన్ వైపు తిరిగింది. కానీ ఆఖర్లో ఫరూఖీ రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది.సూపర్ ఓవర్ లో ఇంతకుమించిన డ్రామా నడిచింది. మొదట సూపర్ ఓవర్లో ఆప్ఘనిస్థాన్ 17 రన్స్ చేసిన చేయగా.. తర్వాత సౌతాఫ్రికా కూడా అంతే స్కోరు సాధించింది. దీంతో మరోసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సారి రెండో సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 23 రన్స్ చేసింది. ఛేజింగ్ లో ఆప్ఘన్లు చివరి వరకూ పోరాడారు. తొలి బంతికే నబీ ఔటైనప్పటకీగుర్బాజ్ వరుసగా 3 సిక్సర్లు బాదడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఇక 2 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా.. ఒక వైడ్ వచ్చింది. కానీ తర్వాతి బంతికి గుర్బాజ్ ఔటవడంతో ఆప్ఘనిస్థాన్ 19 పరుగులే చేయగలిగింది.

Published : 
  • 12 February 2026, 1:00 PM IST