ఇంటివాడు కాబోతున్న ఇషాన్ కిషన్… కాబోయే భార్య ఎవరంటే ?

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్ ఉత్కంఠను పెంచుతుండగా.. మరోవైపు టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్

Post Published By: dialnews
Updated : 16 February 2026, 3:26 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్ ఉత్కంఠను పెంచుతుండగా.. మరోవైపు టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇషాన్ కిషన్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ఇషాన్ కిషన్ తాత అనురాగ్ పాండే సంకేతాలిచ్చారు.కొలంబోలోని భారత్-పాక్ కీలక మ్యాచ్‌కు ముందు మీడియా ప్రతినిధులు ఇషాన్ కిషన్ తాతయ్యను పలకరించగా.. ఆయన తన మనవడి ప్రియురాలి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

జైపూర్‌కు చెందిన ప్రముఖ మోడల్ అదితి హుండియాతో ఇషాన్ కిషన్ ప్రేమలో ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు. అదితి ఎవరో కాదు.. గతంలో జరిగిన మిస్ ఇండియా పోటీలలో రన్నరప్‌గా నిలిచింది. అదితి తన ఇంటర్వ్యూలలో కూడా ఇషాన్ గురించి, అతని కుటుంబం గురించి గొప్పగా మాట్లాడిందని ఆయన గుర్తు చేసుకున్నారు.ఓ వైపు పెళ్లి వార్తలు వినిపిస్తుంటే.. మరోవైపు వరల్డ్ కప్‌లో ఇషాన్ కిషన్ బ్యాట్‌తో చెలరేగిపోతున్నాడు. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో తడబడినప్పటికీ.. నమీబియాపై కేవలం 24 బంతుల్లోనే 60 పరుగులు చేసి సత్తా చాటాడు. పాకిస్థాన్‌తో జరిగే పోరులో కూడా ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా రాజస్థాన్ కు చెందిన ఓ మోడల్ కాగా.. జైపూర్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇషాన్ కిషన్, అదితి హుండియాల పెళ్లి తేదీ ఎప్పుడో ఇంకా నిర్ణయించబడలేదని తెలుస్తోంది. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది. దాదాపుగా రెండున్నర నెలల పాటు కొనసాగుతుంది. దీని తర్వాతే ఇషాన్ కిషన్- ఆదితి హుండియా పెళ్లి పీటలు ఎక్కనున్నారని సమాచారం.

Published : 
  • 16 February 2026, 3:26 PM IST