సీతారామం 2 ఉన్నట్టా…? లేనట్టా…?

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. ఇలా హ్యాట్రిక్ హిట్లతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'ఓన్ హీరో'గా మారిపోయారు దుల్కర్ సల్మాన్. DQ సినిమా వస్తుందంటే చాలు తెలుగు ఆడియన్స్‌లో ఒక తెలియని ఆసక్తి ఉంటుంది.

Post Published By: dialnews
Updated : 26 February 2026, 8:15 PM IST

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. ఇలా హ్యాట్రిక్ హిట్లతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'ఓన్ హీరో'గా మారిపోయారు దుల్కర్ సల్మాన్. DQ సినిమా వస్తుందంటే చాలు తెలుగు ఆడియన్స్‌లో ఒక తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ నటిస్తున్న సినిమా 'ఆకాశంలో ఒక తార'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గానే మేకర్స్ ఈ సినిమా నుంచి హీరోయిన్ సాత్విక వీరవల్లి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. జనవరి 28న శ్రుతీ హాసన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో ఆమె కూడా ఒక పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె కనిపించబోతోంది.

ఈ చిత్రాన్ని మార్చి 20, 2026న సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ మరియు స్వప్న సినిమా ఈ సినిమాను సమర్పిస్తున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దుల్కర్ మరియు మృణాల్ ఠాకూర్ వర్షంలో గొడుగు కింద ఉన్న ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. దీంతో 'సీతారామం 2' రాబోతుందా? అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, గతంలో ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ మాట్లాడుతూ.. 'క్లాసిక్స్ ని మళ్ళీ టచ్ చేయకూడదు' అని చెప్పారు.

సో, ఇది సీక్వెల్ కాకపోయినా, వీరిద్దరి కాంబోలో మళ్ళీ ఒక కొత్త సినిమా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. రానా దగ్గుబాటి నిర్మాణంలో, దుల్కర్ హీరోగా నటించిన 'కాంత' గత నవంబర్ లో రిలీజ్ అయ్యి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. పీరియడ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో DQ నటనకు నేషనల్ అవార్డ్ పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ తర్వాత దుల్కర్‌కు తెలుగులో డిమాండ్ భారీగా పెరిగింది. అందుకే ఇప్పుడు ఆయన టాలీవుడ్ హీరోలతో సమానంగా వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.

Published : 
  • 26 February 2026, 8:15 PM IST