గాలి లెక్కలు.. సోది ముచ్చట్లు.. ఉడత ఊపులు.. తాటాకు చప్పుళ్ళు.. అనుకూల మీడియా భజనలు.. సోషల్ మీడియాలో పిచ్చి రాతలు.. ఇలా అన్నీ... ఒకటి రెండు కాదు.. మొత్తం ప్రపంచం ముందు అమెరికాను పేపర్ పులిని చేసింది ఇరాన్. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టు.. బుజ్జిగాడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటది.. టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ను గుద్దితే ఎలా ఉంటాదో తెలుసా అని.. ఇప్పుడు ఇరాన్ ను అమెరికా, ఇజ్రాయిల్ విషయంలో ఇది రివర్స్ అయింది.. స్కూటర్ గుద్దితే.. టిప్పర్ నామరూపాలు లేకుండా అయిపొయింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గూబ గుయ్యిమంది. వారంలో ముగుస్తుంది, తుడిచేస్తాం అనుకున్న వార్ లో చివరికి ట్రంప్ బ్రతిమాలుకునే పరిస్థితి క్రియేట్ అయింది.
లేటెస్ట్ గా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ప్రయోగించాల్సిన క్షిపణి దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది నిజంగా సిగ్గు చేటే మరి. ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించి నాలుగు వారాలు గడుస్తున్న టైంలో, ఈ సడెన్ డెసిషన్ వెనుక ఉన్న గంభీరమైన పరిస్థితులు ట్రంప్ లో వణుకు పుట్టించాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌ను ముట్టడిస్తున్న వేళ, అకస్మాత్తుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు వెనక్కు వేశారు.
ఇరాన్ ఇంధన కేంద్రాలపై జరగాల్సిన దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం 24 గంటల క్రితం వరకు "ఇరాన్‌ను భూస్థాపితం చేస్తాం" అని హెచ్చరించిన ట్రంప్, ఇప్పుడు "చర్చలు ఫలప్రదంగా ఉన్నాయి" అని ఎందుకు అంటున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఇరాన్ ప్రయోగించిన ఆ క్షిపణులు అమెరికాను భయపెట్టాయా? ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినపడుతోన్న ప్రశ్నలు. అసలు ఏంటి ఆ 6 రీజన్స్..? ఈ స్టోరీలో చూద్దాం.
1: ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై దాడి - గ్లోబల్ ఎనర్జీ షాక్:
ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. ఖతార్‌లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ అనుకూల గ్రూపులు లేదా క్షిపణి దాడులు జరగడం వల్ల ప్రపంచానికి గ్యాస్ సరఫరా చేసే వ్యవస్థ దెబ్బతింది. ఖతార్ నుంచి గ్యాస్ అందకపోతే యూరప్ దేశాలు అంధకారంలోకి వెళ్తాయి. అలాగే చలికి వణికిపోతాయి. అమెరికా మిత్రదేశాలైన నాటో దేశాలు "మాకు గ్యాస్ సరఫరా ఆగిపోతే మేము యుద్ధానికి మద్దతు ఇవ్వలేం" అని ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చాయి. ఆర్థికంగా ప్రపంచం కుప్పకూలే ప్రమాదం ఉందని గ్రహించిన ట్రంప్ ఆలోచనలో పడ్డాడు. ఈ ప్లాంట్ ఓపెన్ అవ్వడానికి 5 ఏళ్ళు పట్టే ఛాన్స్ ఉంది.
2. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థల వైఫల్యం - అణు కేంద్రాల సమీపంలో దాడులు:
యుద్ధంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ గా దీన్ని కూడా చెప్పవచ్చు. ఇజ్రాయెల్ గడ్డపై ల్యాండ్ అయిన మిస్సైల్ ట్రంప్ ను భయపెట్టింది. మార్చి 21 రాత్రి ఇరాన్ గురి పెట్టిన, బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్ గొప్పగా చెప్పుకునే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించుకొని వెళ్లాయి. డిమోనా & ఆరద్ నగరాల్లో పడ్డాయి. ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా నగరంపై నేరుగా క్షిపణులు ల్యాండ్ అయ్యాయి. ఈ అటాక్ దెబ్బకు.. ఇద్దరికీ ఫ్యాంట్ తడిచిపోయింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలైన 'ఐరన్ డోమ్', 'ఆరో-3' లకు తిరుగులేదని అనుకున్నారు. కానీ ఇరాన్ క్షిపణులు వీటిని ఛేదించి, ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా నగరానికి అతి సమీపంలో పడ్డాయి. అణు కేంద్రంపై దాడి జరిగితే అది కేవలం యుద్ధం కాదు, మహా ప్రళయం అవుతుందని ఇజ్రాయెల్ భయపడింది.
తమ రక్షణ వ్యవస్థలు 100% రక్షణ ఇవ్వలేవని ఇజ్రాయెల్ సైన్యం అంగీకరించడం అమెరికాకు పెద్ద షాక్. అణు కేంద్రానికి ఇంత దగ్గరగా దాడులు జరగడం, ఇజ్రాయెల్ రక్షణ కవచం విఫలం కావడం ట్రంప్ సర్కార్ కంప్లీట్ గా డిఫెన్స్ లోకి నెట్టేసింది. వెదురు బాణాలు అనుకున్న క్షిపణులు.. ఈ రేంజ్ లో అటాక్ చేయడం ట్రంప్ కలలో కూడా ఊహించలేదు. ఒకవేళ అణు కేంద్రంపై దెబ్బ పడితే ఆ వినాశనం ఊహాతీతం అని నాటో దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
3. ఖతార్, ఇంటర్నేషనల్ బేస్‌లపై దాడులు:
ఇరాన్ తన పరిధిని కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం చేయలేదు. ఖతార్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం 'అల్-ఉదైద్' పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే, హిందూ మహాసముద్రంలోని అమెరికా-యుకే ఉమ్మడి ఆర్మీ బేస్ 'డిగో గార్సియా' పై కూడా ఇరాన్ 4000 కిలోమీటర్ల దూర పరిధి గల క్షిపణులను ప్రయోగించింది. తన క్షిపణులు ఎక్కడికైనా చేరుకోగలవని ఇరాన్ నిరూపించడంతో అమెరికా సైనిక వ్యూహం దెబ్బతింది. యూరప్ దేశాలు ఒత్తిడి చేయడం వెనుక కారణం ఇదే. అసలు హార్ముజ్ విషయంలో వాళ్ళు వేలు పెట్టకపోవడం వెనుక భయం కూడా ఇదే. అమెరికా స్థావరాలు ఎక్కడున్నా సురక్షితం కాదని ఇరాన్ హెచ్చరిక పంపింది. దీనివల్ల బ్రిటిష్ ప్రభుత్వం కూడా యుద్ధం నుంచి తప్పుకోవాలని భావించింది, ఇది అమెరికాను ఒంటరిని చేసింది.
4. చమురు ధరలు, హోర్ముజ్ జలసంధి దిగ్బంధం:
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపట్టు లాంటి 'హోర్ముజ్ జలసంధి'ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. 1970 నాటి సంక్షోభం మళ్లీ వస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. ట్రంప్ తన ఓటర్లకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అమెరికాలో ధరలు తగ్గించాలి, కానీ యుద్ధం వల్ల ధరలు పెరగడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు ముప్పుగా మారింది. అందుకే చర్చల ద్వారా పరిష్కారం కోసం మొగ్గు చూపారు.
5: అమెరికా యుద్ద విమానం కూలిపోవడం:
తాజా గగనతల పోరులో అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం కూలిపోవడం అమెరికా సైనిక ప్రతిష్టను దెబ్బతీసింది. ఇరాన్ దగ్గర ఉన్న రష్యన్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేదా వారి సొంత టెక్నాలజీతో అమెరికా విమానాలను కూల్చగలమని నిరూపించారు. అమెరికా సైనికుల ప్రాణనష్టం పెరిగితే ట్రంప్‌కు స్వదేశంలో నిరసనలు ఎదురవుతాయి.
6. నాటో దేశాల ఒత్తిడి & చర్చల వ్యూహం:
యుద్ధం ముదురుతుంటే యూరప్ దేశాలు, నాటో దేశాలు తీవ్ర ఆందోళన చెందాయి. ఇరాన్ ఎదురుదాడి చేసే సామర్థ్యం అంచనాల కంటే ఎక్కువగా ఉందని అర్థమయ్యాక, టర్కీ, పాకిస్థాన్ వంటి దేశాలు మధ్యవర్తులుగా రంగంలోకి దిగాయి. ప్రస్తుతానికి దాడులను 5 రోజుల పాటు నిలిపివేసి, "సంపూర్ణ శాంతి పరిష్కారం" కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ వెనక్కు తగ్గడం అనేది పూర్తిగా శాంతి కోసమా లేక కొత్త వ్యూహం కోసమా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ, ఇరాన్ చూపించిన క్షిపణి బలం మరియు ఆర్థిక సంక్షోభ భయం అమెరికాను ప్రస్తుతానికి యుద్ధ విరమణ దిశగా నడిపించాయి.