Top story:చస్తారా..? బ్రతుకుతారా..? తేల్చుకోండి.. అమెరికన్లకు ఇరాన్ ఎమోషనల్ వార్నింగ్…!

ప్రపంచం వినాశనం అంచున నిలబడింది.. ఇరాన్-అమెరికా యుద్ధం ఐదవ వారంలోకి ప్రవేశించి, వేలమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న వేళ.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఒక సంచలన అడుగు వేశారు.

Post Published By: dialnews
Updated : 4 April 2026, 5:30 PM IST

ప్రపంచం వినాశనం అంచున నిలబడింది.. ఇరాన్-అమెరికా యుద్ధం ఐదవ వారంలోకి ప్రవేశించి, వేలమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న వేళ.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఒక సంచలన అడుగు వేశారు. బాంబుల మోత మధ్య, క్షిపణుల గర్జనల మధ్య.. ఆయన అమెరికా ప్రభుత్వానికి కాదు, నేరుగా అమెరికా ప్రజలకు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ప్రతి అక్షరం ఒక తూటా లాంటిది.. ప్రతి వాక్యం ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్న. అసలు ఈ యుద్ధం ఎవరి కోసం..? మీ పిల్లల ప్రాణాలు ఎందుకు బలి కావాలి..?పెజెష్కియాన్ తన లేఖను అత్యంత వినమ్రంగా మొదలుపెట్టారు. 'అమెరికా ప్రజలారా.. మాకు మీతో శత్రుత్వం లేదు. మా పోరాటం మీ ప్రభుత్వ విధానాలతోనే తప్ప మీతో కాదు' అని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజలు కూడా మీలాగే శాంతిని కోరుకుంటున్నారు, తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు అని చెబుతూ.. యుద్ధం వల్ల సామాన్యులే నష్టపోతారని ఆయన గుర్తు చేశారు. ఇది అమెరికా ప్రజల మనసు గెలుచుకునే ఒక గొప్ప ఎమోషనల్ మూవ్.

ఈ యుద్ధం వల్ల అమెరికన్లకు వచ్చే లాభం ఏంటి? అని పెజెష్కియాన్ ప్రశ్నించారు. 'అమెరికా ఫస్ట్' అని చెప్పే ట్రంప్.. అమెరికా సంపదను, సైనికుల రక్తాన్ని కేవలం ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం ఎందుకు ధారపోస్తున్నారు..? అమెరికన్ సైనికుల రక్తం కేవలం ఇజ్రాయెల్ రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చవుతోందని ఆయన విమర్శించారు. మీ పన్నుల డబ్బు బాంబుల రూపంలో మాపై పడుతోంది.. అదే డబ్బుతో మీ దేశంలో పాఠశాలలు, ఆసుపత్రులు కట్టవచ్చు కదా? అని ఆయన వేసిన ప్రశ్నలు ఇప్పుడు అమెరికా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన వేడుకున్నారు.లేఖలో ఆయన ఒక కీలక పాయింట్ చెప్పారు.. 'గత వందల ఏళ్లలో ఇరాన్ ఏ దేశంపై ముందుగా దాడి చేయలేదు. మేము శాంతి కాముకులం. కానీ మా ఆత్మగౌరవం దెబ్బతింటే, మా భూమిపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోం'. ప్రస్తుతం ఇరాన్ చేస్తున్నది యుద్ధం కాదు, కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం అని ఆయన వివరించారు. అమెరికా మీడియా ఇరాన్‌ను ఒక 'విలన్'లా చూపిస్తోందని, కానీ అసలు విలన్లు ఎవరో అమెరికా ప్రజలే ఆలోచించాలని కోరారు.

ఇరాన్‌ను ఒక భూతంలా చూపిస్తూ, యుద్ధాన్ని సమర్థించుకోవడానికి లేని శత్రువును సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. "శత్రువు లేకపోతే, ఒకరిని సృష్టించడం" ద్వారా ఆయుధ పరిశ్రమను మరియు యుద్ధ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. అమెరికా ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్లే నేడు ఈ స్థాయి అపనమ్మకం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఇరాన్ ప్రజాస్వామ్య మార్గాన్ని అమెరికా ఎలా దెబ్బతీసిందో వివరిస్తూ, ఇరాన్ ఎప్పుడూ ఆక్రమణలకు పాల్పడలేదని, కేవలం తనను తాను రక్షించుకుందని పేర్కొన్నారు.అమెరికాలో ఉన్న ఇరాన్ వలసదారుల గురించి మాట్లాడారు. అమెరికాలోని యూనివర్సిటీల్లో, టెక్నాలజీ రంగంలో ఇరానియన్ల కృషిని చూడమని, వారిని చూసైనా ఇరాన్ ప్రజలు ఎంత శాంతి కాముకులో అర్థం చేసుకోమని అమెరికన్లకు సూచించారు. చివరగా, 'యుద్ధం వల్ల విధ్వంసం తప్ప ఏమీ రాదు.. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం' అని శాంతి సందేశం ఇచ్చారు. ఘర్షణల మార్గం ఎంచుకుంటే అది భవిష్యత్తు తరాలకు విధ్వంసాన్ని మిగులుస్తుందని, అదే చర్చల మార్గం ఎంచుకుంటే శాంతి నెలకొంటుందని చెప్పారు.ఈ రెండిటిలో ఏది కావాలో అమెరికా ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ లేఖ కేవలం ఒక కాగితం కాదు.. ఇది అమెరికా ప్రజల హృదయాలను తట్టి, యుద్ధానికి వ్యతిరేకంగా వారిని రోడ్లపైకి తెచ్చే ఒక దౌత్యపరమైన వ్యూహం. ఒకవైపు క్షిపణుల యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు ఇలాంటి 'మైండ్ గేమ్స్' రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.

Published : 
  • 4 April 2026, 5:30 PM IST