కోల్ కతా కథ ఇక ఇంతేనా….? గ్రీన్ బౌలింగ్ కు గ్రీన్ సిగ్నల్…!

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ మంచి కమ్ బ్యాక్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే మినీ వేలంలో మంచి మంచి ప్లేయర్లను కేకేఆర్ కొనుగోలు చేయడం, సక్సెస్‌ఫుల్ మ్యాన్ అభిషేక్ నాయర్ ఆ జట్టుకు హెడ్ కోచ్ రావడం.

Post Published By: dialnews
Updated : 10 April 2026, 3:50 PM IST

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ మంచి కమ్ బ్యాక్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే మినీ వేలంలో మంచి మంచి ప్లేయర్లను కేకేఆర్ కొనుగోలు చేయడం, సక్సెస్‌ఫుల్ మ్యాన్ అభిషేక్ నాయర్ ఆ జట్టుకు హెడ్ కోచ్ రావడం.. వీటన్నింటితో కలిపి ఈ ఏడాది కేకేఆర్ తిరుగులేని జట్టుగా ఉంటుందని అందరూ భావించారు. కానీ కీలక బౌలర్లు గాయపడటం 25 కోట్లు పెట్టి కొన్న ఆల్‌రౌండర్ కనీసం ఒక్క ఓవర్ కూడా వేయకపోవడంతో కేకేఆర్ దారుణంగా విఫలమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. బౌలింగ్‌లో సున్నాగా మిగిలిపోతోంది.

వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. కార్తీక్ త్యాగీ పోరాడుతున్నప్పటికీ మిగతా బౌలర్లు రాణించకపోవడం కేకేఆర్ బౌలింగ్‌ను మరింత బలహీనంగా మార్చింది.మినీ వేలంలో 25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ ఈ సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో కేకేఆర్ మూడు మ్యాచ్‌లు ఆడితే అందులో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిగతా రెండు మ్యాచ్‌లలో కలిపి కామెరూన్ గ్రీన్ చేసింది కేవలం 20 పరుగులు మాత్రమే. ముంబైపై తొలి మ్యాచ్‌లో 18, సన్‌రైజర్స్‌పై 2 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.

ఆల్‌రౌండర్ కోటాలో కామెరూన్ గ్రీన్‌ని దక్కించుకుంటే ఇప్పటి వరకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం కామెరూన్ గ్రీన్‌తో కేకేఆర్ బౌలింగ్ చేయించడం లేదు. కామెరూన్ గ్రీన్ ఫ్లాప్ షో పై మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నెంబర్ 3లో బ్యాటింగ్‌కి వచ్చి ఆ స్థాయిలో రాణించకపోవడం, బౌలింగ్ చేయకపోవడం కేకేఆర్‌కు భారంగా మారాయని చెప్పాడు. అయితే గ్రీన్ బౌలింగ్ చేసేందుకు ఆసీస్ బోర్డు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. బ్యాట్ తో కాకున్నా బంతితోనైనా గ్రీన్ రాణిస్తాడేమో చూడాలి.

Published : 
  • 10 April 2026, 3:50 PM IST