ఆ ప్లేయర్స్ కు చెన్నై గుడ్ బై… సీఎస్కే వదిలేసేది వీళ్లనే…!

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నిరాశపర్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన చెన్నై టీమ్.. వరుసగా మూడో సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది.

Post Published By: dialnews
Updated : 23 May 2026, 2:10 PM IST

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నిరాశపర్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన చెన్నై టీమ్.. వరుసగా మూడో సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. అయితే గత రెండు సీజన్లతో పోల్చితే ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శనే చేసింది. కానీ కీలక సమయంలో వరుస పరాజయాలను మూటగట్టుకొని మూల్యం చెల్లించుకుంది.గాయాల బెడద, నిలకడలేమి ఆట చెన్నై సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించాయి. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న సీఎస్‌కే వచ్చే సీజన్‌పై ఫోకస్ పెట్టింది. జట్టు బలహీనతలను అధిగమించేందుకు అవసరం లేని ఆటగాళ్లను వదిలించుకోవడంపై కసరత్తులు చేస్తోంది. ఐపీఎల్ 2027 వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎల్లో ఆర్మీ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2026 మినీ వేలంలో 14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన అనామక ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ తీవ్రంగా నిరాశపర్చాడు. అతనిపై ఫ్రాంచైజీ ఎన్నో ఆశలు పెట్టుకోగా పేలవ ప్రదర్శనతో నట్టేట ముంచేసాడు. ప్రైజ్ ట్యాగ్ ఒత్తిడో లేక మరే కారణమో తెలియదు కానీ ప్రశాంత్ వీర్ స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. 6 మ్యాచ్‌ల్లో 45 సగటుతో 90 పరుగులే చేశాడు.బౌలింగ్‌లో ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఈ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కోల్పోయి బెంచ్‌కే పరిమితమయ్యాడు.చెన్నై‌లోని స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌కు సరిగ్గా సూటవుతాడని ఐపీఎల్ 2026 మినీ వేలంలో రాహుల్ చాహర్‌ను రూ.5.20 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది.

కానీ అతను ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 11.26 ఎకానమీతో 46 పరుగులు సమర్పించుకున్నాడు.ఈ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కోల్పోయిన రాహుల్ చాహర్.. బెంచ్‌కే పరిమితమయ్యాడు. అకీల్ హుస్సేన్, నూర్ అహ్మద్ సత్తా చాటడంతో రాహుల్ చాహర్‌ను ఆడించే అవసరం రాలేదు. ఐపీఎల్ 2027 వేలానికి ముందు రాహుల్ చాహర్‌ను వదిలేసి అతని స్థానంలో మంచి భారత స్పిన్నర్‌ను కొనుగోలు చేయాలని సీఎస్‌కే భావిస్తోంది.

అలాగే 75 లక్షల కనీస ధరతో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఈ సీజన్ ఆరంభంలో వరుసగా అవకాశాలు అందుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్‌గా దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు చేశాడు. కానీ జట్టు కంటే వ్యక్తిగత ప్రదర్శనకే సర్ఫరాజ్ ఖాన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.టీమ్ అవసరాలకు అనుగుణంగా ఆడకుండా దూకుడుగా ఆడబోయి వికెట్లు పారేసుకున్నాడు. దాంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఈ సీజన్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 23 సగటుతో 161 పరుగులే చేశాడు. ఈ ముగ్గురిని వదిలేసి మినీ వేలంలో కొత్త ప్లేయర్స్ ను తీసుకునే ఛాన్స్ ఉంది.

Published : 
  • 23 May 2026, 2:10 PM IST