భారత స్టార్ క్రికెటర్, టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు, క్రమంగా జట్టులో కూడా చోటు దక్కకుండా పోయింది. ఇటీవల ఐర్లాండ్ పర్యటనలో ఆడిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మెన్ ఇన్ బ్లూ జట్టులో మళ్లీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో స్కై చేసిన తాజా పోస్ట్ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పోస్ట్‌లో సూర్య జట్టుకు తన మద్దతును తెలియజేయడంతో పాటు పలు కీలక విషయాలను పంచుకున్నారు.
సూర్యకుమార్ యాదవ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ.. ప్రస్తుతం ఆడుతున్న భారత జట్టు గురించి ఎంతో సానుకూలంగా మాట్లాడాడు. తాను ప్రస్తుత టీమిండియా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. ,జట్టులోని ఆటగాళ్లందరూ దేశం కోసం తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారని తనకు బాగా తెలుసన్నాడు. తన పూర్తి మద్దతు ఎప్పటికీ మన జట్టుకే ఉంటుందంటూ సూర్య రాసుకొచ్చాడు. కెప్టెన్సీ, జట్టులో చోటు కోల్పోవడంతో సూర్య అసంతృప్తితో ఉన్నాడంటూ వస్తున్న వార్తలకు ఇలా చెక్ పెట్టాడు.భారత జట్టుకు మద్దతు ఇవ్వడంతో పాటు, సూర్యకుమార్ యాదవ్ తన పోస్ట్‌లో భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
వైభవ్‌ను ఉద్దేశించి సూర్య ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు రాశాడు. వైభవ్ ప్రస్తుతం ఎన్నో అంచనాలు, ఎంతో ఉత్సాహంతో కూడిన ఒక గొప్ప క్రికెట్ ప్రయాణం ప్రారంభంలో ఉన్నాడనీ, తన కెరీర్‌లోని ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని సూచించాడు. నీ ఆటతీరుతో మన దేశం గర్వపడేలా చేస్తూనే ఉండు” అంటూ సూర్య తన పోస్చులో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌లో సూర్యకుమార్ యాదవ్ తనపై జరుగుతున్న ఒక తప్పుడు ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డాడు. సోషల్ మీడియాలో తన పేరుతో చెలామణి అవుతున్న ఒక ప్రకటన పూర్తిగా అబద్ధమని తేల్చి చెప్పాడు. భారత క్రికెట్ లో మిస్టర్ 360గా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ లో 1 టెస్ట్ మ్యాచ్, 37 వన్డేలు, 113 టీ20 లు ఆడాడు.