భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ యంగ్ క్రికెటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెన్నిస్‌లో యానిక్ సినర్, అల్కరాజ్‌లను చూస్తే గేమ్ మారిపోయిందని ఎలా అనిపిస్తుందో, క్రికెట్‌లో అభిషేక్, వైభవ్‌లను చూసినప్పుడు కూడా అదే భావన కలుగుతోందని యువీ అన్నారు.
తన్ను తాను 'టెర్మినేటర్'గా భావించే యువీ.. తనకంటే నాలుగు రెట్లు దూకుడుగా ఆడే అభిషేక్ శర్మను 'టెర్మినేటర్ 4' గా అభివర్ణించారు. అలాగే భారీ షాట్లతో విరుచుకుపడే వైభవ్ సూర్యవంశీని 'టెర్మినేటర్ 6' గా పేర్కొన్నారు. ఈ ఇద్దరు కుర్రాళ్లు తనకంటే ఎంతో వేగంగా ఆడుతున్నారని, భవిష్యత్తులో వైభవ్ గొప్ప క్రికెటర్ అవుతాడని యువరాజ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల వీరంతా కలిసి వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌ను కూడా వీక్షించారు.