Top Story: జగన్ ఈజ్ బ్యాక్.. మళ్లీ పాత స్టైల్ లో జగన్…. వైసీపీలో కొత్త జోష్..!

వైసీపీ అధినేత వైయస్ జగన్ పాత స్టైల్ లోకి వచ్చేసారు. చేతిలో మైక్ ని మరో చేతితో తడుతూ.... జనాన్ని ఉర్రూతలూగించారు. ఎడమ చేతిని గాల్లోకి ఎత్తి.... అలా అలా అలా... అంటూ మళ్లీ పాత రోజులు గుర్తు చేశారు.

Post Published By: dialnews
Updated : 16 July 2026, 11:17 AM IST

వైసీపీ అధినేత వైయస్ జగన్ పాత స్టైల్ లోకి వచ్చేసారు. చేతిలో మైక్ ని మరో చేతితో తడుతూ.... జనాన్ని ఉర్రూతలూగించారు. ఎడమ చేతిని గాల్లోకి ఎత్తి.... అలా అలా అలా... అంటూ మళ్లీ పాత రోజులు గుర్తు చేశారు. జగన్ జనంలోకి వస్తే ఇలా ఉంటుంది అని చెప్తూ వైసిపి అధినేత తన పాత స్టైల్ ను మళ్లీ ప్రదర్శించారా అనే చర్చ జరుగుతోంది. చాలా రోజుల తర్వాత తమకు పార్టీ అధినేతలో పాత జగన్ కనిపించారంటూ క్యాడర్ తెగ సంబరపడిపోతున్నారు.

భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశంలో జగన్..... తన పాదయాత్ర నాటి ప్రసంగాన్ని...హావభావాలను చూపించారు. అంతే ఒక్కసారిగా పార్టీ కేడర్లో జోష్ అందుకుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత జగన్ ఇలా పాత పద్ధతిలో ప్రసంగించారు. భీమవరం...అంటూ తనదైన శైలిలో పలకరించారు.ఏ ఊరు వెళ్తే ఆ వూరు పేరు చెప్పి....మైక్‌ను చేత్తో తడుతూ సౌండ్ చేసి కేడర్‌ను ఉత్సాహపరచడం జగన్ స్టైల్.సీఎంగా ఉన్న ఐదు ఏళ్లు జగన్ సభలు, ప్రసంగాలు నార్మల్‌గానే నడిచాయి. ఓడిపోయాక కొన్ని సమావేశాలు, సభల్లో ప్రసంగించినా అది అంతంత మాత్రమే. భీమవరంలో మాత్రం మళ్లీ పాత స్టైల్ చూపించేశారు జగన్.

దీంతో జనంలో ఎక్కడలేని రియాక్షన్ కనిపించింది.త్వరలో పాదయాత్ర చేస్తానని ప్రకటించిన జగన్....దానికి సన్నద్ధంగానా అన్నట్టుగా భీమవరం సభలో ఓ రేంజ్‌లో ప్రసంగించారు. ఆక్వా రైతులకు కూటమి ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని సభికులతోనే చెప్పించారు. ఇది కూడా పాత పద్ధతిలోనే చేశారు జగన్.జగన్ తన పాదయాత్రకు చిన్న టీజర్ వదిలారని... మున్ముందు ట్రైలర్ కూడా వస్తుందని వైసీపీ నేతలు చెప్తున్నారు.

Published : 
  • 16 July 2026, 11:17 AM IST