ప్రేమలో మునిగిపోయిన అర్షదీప్.. గాళ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన పేసర్..!

హీరోయిన్స్ , మోడల్స్ తో భారత క్రికెటర్లకు లవ్ స్టోరీ కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆ జాబితాలోటీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా చేరాడు. ఈ భారత పేసర్ తన ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించాడు.

Post Published By: dialnews
Updated : 28 July 2026, 2:20 PM IST

హీరోయిన్స్ , మోడల్స్ తో భారత క్రికెటర్లకు లవ్ స్టోరీ కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆ జాబితాలోటీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా చేరాడు. ఈ భారత పేసర్ తన ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించాడు. జమ్ముకశ్మీర్‌కు చెందిన మోడల్, నటి సమ్రీన్ కౌర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సమ్రీన్ కౌర్‌తో పబ్లిక్‌గా రొమాన్స్ చేసిన ఫొటోలను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు ఆమె నా మనిషి అనే క్యాప్షన్ ఇచ్చాడు.ఐపీఎల్ 2026 సీజన్‌ సమయంలోనే నటి సమ్రీన్ కౌర్‌తో అర్ష్‌దీప్ సింగ్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే అప్పట్లో ఈ జోడీ మౌనంగా ఉంది. కానీ తాజాగా తమ రిలేషన్‌ను అధికారికంగా ధ్రువీకరించింది. అర్ష్‌దీప్ సింగ్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు 2 మిలియన్ల‌కు పైగా లైకులు వచ్చాయి.జమ్మూ కశ్మీర్‌కు చెందిన సమ్రీన్ కౌర్ 1999 సెప్టెంబర్ 7న జన్మించింది. పుణెలో బీకామ్ ఆనర్స్ డిగ్రీ పట్టా పొందింది. ఫెమినా మిస్ ఇండియా 2018 ఎడిషన్ ఫైనలిస్ట్‌గా నిలిచి తొలిసారి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత మోడలింగ్‌‌ను కెరీర్‌‌గా ఎంచుకుంది.

ఆమె అందానికి ఫిదా అయిన దర్శకులు సినిమా అవకాశాలు ఇవ్వడంతో నటిగా మారిపోయింది. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తీసిన 83 సినిమాతో పాటు సర్దార్ జీ 2 చిత్రల్లోనూ నటించింది. పలు వెబ్ సిరీస్‌ల్లోనూ మెప్పించింది. ఇక ఇన్‌స్టాలోనూ ఆమెకు 4.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.మరోవైపు అర్ష్‌దీప్ సింగ్.. టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. వన్డేల్లో తన చోటును సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అర్ష్‌దీప్ సింగ్.. టీ20 సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. కానీ పేలవమైన బౌలింగ్ తో నిరాశపరిచాడు.

Published : 
  • 28 July 2026, 2:20 PM IST