Top story:ఏం చిల్లర గాళ్ళురా..? ఇంగ్లాండ్ క్రికెటర్ల రోత పనులు చేతులకు బేడీలు వేసి ఈడ్చుకెళ్లిన పోలీసులు! ఇంగ్లాండ్ క్రికెట్ పరువు తీస్తున్న నైట్‌క్లబ్ ..!

"మైదానంలో ఆట కంటే.. అర్ధరాత్రి నైట్‌క్లబ్‌లలో చిల్లర వేషాలు వేయడమే ఎక్కువైపోయిందా?" ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఇదే అనుమానం వస్తోంది

Post Published By: dialnews
Updated : 25 August 2026, 4:30 PM IST

"మైదానంలో ఆట కంటే.. అర్ధరాత్రి నైట్‌క్లబ్‌లలో చిల్లర వేషాలు వేయడమే ఎక్కువైపోయిందా?" ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఇదే అనుమానం వస్తోంది. యాషెస్ సిరీస్‌లో అదరగొట్టిన ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్, తాజాగా డెర్బీలోని ఒక నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవలో పోలీసులకు దొరికిపోయాడు. చేతులకు బేడీలతో, తలదించుకుని పోలీసులు జీపు ఎక్కిస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అసలు ఆ రాత్రి నైట్‌క్లబ్‌లో ఏం జరిగింది? ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు దీనిపై ఎలాంటి విచారణకు ఆదేశించింది?

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా డెర్బీషైర్‌పై డర్హామ్ జట్టు భారీ విజయం సాధించిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆడిన బ్రైడన్ కార్స్, అతని టీమ్‌మేట్ మాథ్యూ పాట్స్ ఇద్దరూ కలిసి డెర్బీలోని ఒక నైట్‌క్లబ్‌కు వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో కార్స్ తీవ్రమైన గొడవకు దిగినట్లు తెలుస్తోంది. క్లబ్ సిబ్బందితో లేదా స్థానికులతో జరిగిన ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంత చెప్పినా వినకుండా రచ్చ చేయడంతో, పోలీసులు కార్స్ చేతులకు హ్యాండ్‌కఫ్స్ (బేడీలు) వేసి మరీ క్లబ్ నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంగ్లాండ్ క్రికెట్ పరువు ఒక్కసారిగా బజార్న పడింది.

పాకిస్తాన్‌తో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టులో బ్రైడన్ కార్స్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. హెడింగ్లీలో జరిగిన మొదటి టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించిన ఆనందంలో ఉండగానే, ఈ లోపే కార్స్ ఈ చిల్లర వ్యవహారంతో వార్తల్లోకెక్కాడు. ఈ ఘటనపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అత్యంత సీరియస్‌గా స్పందించింది. "డెర్బీలో జరిగిన నైట్‌క్లబ్ ఘటన మా దృష్టికి వచ్చింది, దీనిపై ప్రస్తుతం అంతర్గత విచారణ జరుపుతున్నాం" అంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విచారణ పూర్తయ్యే వరకు కార్స్‌ను జట్టు నుంచి తప్పించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే ఈ గొడవకు కొన్ని రోజుల ముందే ఇంగ్లాండ్ కొత్త టెస్ట్ కెప్టెన్ జో రూట్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. గతంలో బెన్ స్టోక్స్ కెప్టెన్సీ ముగిసిన తర్వాత, ఆటగాళ్లపై ఉన్న రాత్రి పూట కర్ఫ్యూ నిబంధనను జో రూట్ పూర్తిగా ఎత్తేసాడు. "ఆటగాళ్లంతా మెచ్యూర్డ్ అడల్ట్స్, మైదానం వెలుపల ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వాళ్లకు తెలుసు. కాబట్టి మా జట్టులో ఎలాంటి కర్ఫ్యూలు ఉండవు" అని రూట్ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. కానీ, రూట్ అలా ఫ్రీడమ్ ఇచ్చాడో లేదో.. ఇలా మనోళ్లు నైట్‌క్లబ్‌లో బేడీలతో దొరికిపోయి కెప్టెన్ నమ్మకాన్ని నడిరోడ్డుపై పడేశారు.

నిజానికి ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఇలాంటి చిల్లర వేషాలు వేయడం ఇదే మొదటిసారి కాదు, వీళ్లకు ఇదొక పెద్ద హిస్టరీనే ఉంది. గతంలో వైట్ బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వెల్లింగ్టన్‌లో ఒక నైట్‌క్లబ్ బౌన్సర్‌తో గొడవ పడ్డాడు. ఆ తర్వాత 'బాజ్‌బాల్' ఎరా ముగిసే సమయంలో లండన్ నైట్‌క్లబ్‌లో మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రచ్చ చేయడంతో వాళ్లను ఒక టెస్ట్ మ్యాచ్ నుంచే సస్పెండ్ చేశారు. గతంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో కూడా ఇలాంటి నైట్‌క్లబ్ గొడవలు జరగడం వల్లే బోర్డు కర్ఫ్యూ పెట్టింది. ఇప్పుడు మళ్లీ కర్ఫ్యూ తీసేయడమే ఆలస్యం కార్స్ తన బుద్ధి బుద్ధి చూపించుకున్నాడు.లార్డ్స్ వేదికగా గురువారం నుంచి పాకిస్తాన్‌తో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇలాంటి కీలకమైన సమయంలో ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించిన బ్రైడన్ కార్స్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో చూడాలి. ఆటగాళ్లకు ఇచ్చే అతి స్వేచ్ఛే ఇలాంటి పతనానికి దారితీస్తుందా?

Published : 
  • 25 August 2026, 4:30 PM IST