Vijay sai : వెంకన్న మీద ఒట్టు… శాంతితో రిలేషన్ ఇదే !

అక్రమ సంబంధం కేసులో అడ్డంగా ఇరుక్కుపోయిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి x లో మరోసారి వివరణ ఇచ్చుకున్నారు. శాంతితో తనకు ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 July 2024, 7:00 PM IST

 

 

అక్రమ సంబంధం కేసులో అడ్డంగా ఇరుక్కుపోయిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి x లో మరోసారి వివరణ ఇచ్చుకున్నారు. శాంతితో తనకు ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టారు. ఇది మీడియా వాళ్ళ కోసం కాదు... ప్రజల కోసం చెబుతున్నానంటూ వివరణ ఇచ్చుకున్నారు విజయసాయిరెడ్డి. కానీ శాంతి భర్త డిమాండ్ చేసిన DNA పరీక్షల గురించి మాత్రం ఆ మెస్సేజ్ లో వివరించలేదు. విజయసాయి రెడ్డి వల్లే... తన భార్య శాంతి గర్భవతి అయిందంటూ భర్త మదన్ మోహన్ గత వారం రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పుట్టిన బిడ్డకు అతనే తండ్రి అంటున్నాడు. ఈ ఆరోపణలను ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు విజయసాయి రెడ్డి. కానీ మదన్ మాత్రం DNA టెస్టులకు రావాలని సవాల్ విసురుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి X ద్వారా వివరణ ఇచ్చుకున్నారు విజయసాయి రెడ్డి. ఎండోమెంట్ మాజీ ఆఫీసర్ శాంతి కళింగిరితో పరిచయం ఎప్పుడు ఏర్పడిందో వివరించారు. తనకీ, ఆమెకీ మధ్య ఉన్న సంబంధం ఏంటో ట్వీట్ ద్వారా తెలిపారు వైసీపీ ఎంపీ.

2020లో శాంతిని వైజాగ్ సీతమ్మధార ఆఫీసులో మొదటిసారిగా కలిసినప్పటి నుంచి... ఇప్పటి వరకూ ఆమెను కూతురుగానే భావించానని ట్వీట్ చేశారు. ఓ తండ్రిలా సాయం చేశా... తనకు కొడుకు పుట్టాడంటే వెళ్ళి పలకరించా... తాడేపల్లిలో మా ఇంటికి తీసుకొస్తే... ఆశీర్వించా అంటూ ట్వీట్ లో తెలిపారు. అబద్దాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానెళ్ళు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు తాను సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు విజయసాయి రెడ్డి. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నందున... శాంతితో తనకున్న రిలేషన్ ఎలాంటిదో వివరించారు. తనకు ఏ పరాయి మహిళతో అనైతిక, అక్రమ సంబంధాలు లేవు... నేను నమ్మిన దేవ దేవులు శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కూడా చెబుతాను అంటూ X లో తెలిపారు విజయసాయి రెడ్డి.

శాంతి విషయంలో ఇప్పటికే విజయసాయి వైసీపీలో ఒంటరివాడయ్యారు. ఆయనకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. మరోవైపు మీడియా ఛానెళ్ళతో పెట్టుకొని మరో పెద్ద తప్పుచేశారు. ఇంకోవైపు... తన భార్యతో సంబంధం లేనప్పుడు... విజయసాయిరెడ్డి DNA టెస్టుకు ఎందుకు రావట్లేదని సవాల్ చేస్తున్నాడు శాంతి మొదటి భర్త మదన్ మోహన్. ఈ వరుస ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న విజయసాయి రెడ్డి... చివరకు ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. కానీ నెటిజన్లు మాత్రం... ఆ DNA టెస్ట్ ఏదో చేసుకొని... వాళ్ళ ముఖాన పారేయొచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు.

Published : 
  • 20 July 2024, 7:00 PM IST