నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండు భారీ అవార్డులను గెలుచుకున్నారు. కాంతార: చాప్టర్ 1' చిత్రానికి గానూ ఆయన 'ఉత్తమ దర్శకుడు' పురస్కారాన్ని దక్కించుకున్నారు. అంతేకాకుండా, సినీ రంగానికి ఆయన అందిస్తున్న సేవలకు గానూ 'లీడర్షిప్ ఇన్ సినిమా' అవార్డును కూడా అందుకొన్నారు.
ఈ పురస్కారాలు అందుకోవడం తనకు ఎంతో గౌరవంగా ఉందని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ విజయం తన ఒక్కడిదే కాదని, తన సినిమా యూనిట్‌కు, కన్నడ సినీ పరిశ్రమకు మరియు తమ సంస్కృతీ సంప్రదాయాలకు దక్కుతుందని సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.