కన్నడ రాకింగ్ స్టార్ యశ్ క్రేజ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'కేజీఎఫ్' సిరీస్‌తో పాన్-ఇండియా స్టార్‌గా మారిన యశ్, ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'టాక్సిక్' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే 'టాక్సిక్' మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరొక మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'రామాయణ'. ఈ చిత్రంలో యశ్ రావణాసురుడి పాత్రలో కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ క్రమంలోనే 'రామాయణ' సినిమా బడ్జెట్‌కు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది.
ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 4000 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్త ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. సాధారణంగా భారతీయ సినిమాలకు వందల కోట్లలో బడ్జెట్ ఉండటం చూశాం, కానీ ఏకంగా 4000 కోట్లు అనగానే అందరిలోనూ రకరకాల అనుమానాలు, ఆశ్చర్యం వ్యక్తమయ్యాయి.ఈ భారీ బడ్జెట్ ప్రచారంపై అసలు నిజ నిజాలను స్పష్టం చేస్తూ, రాకింగ్ స్టార్ యశ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ బడ్జెట్ చర్చకు దారితీశాయి. అయితే, దానిపై క్లారిటీ ఇస్తూ యశ్ అసలు విషయాన్ని వెల్లడించారు. 4000 కోట్ల బడ్జెట్ అనేది కేవలం ఒక్క సినిమాకి సంబంధించినది కాదు అని ఆయన స్పష్టం చేశారు.
రామాయణ' చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ 4000 కోట్ల అంచనా అనేది ఈ రెండు భాగాలకు కలిపి పెడుతున్న ఖర్చు.
ఈ సినిమాను హోలీవుడ్ అత్యున్నత ప్రమాణాలకు తగట్టుగా వీఎఫ్ఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. కేవలం చిత్రీకరణ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో జరగబోయే గ్లోబల్ ప్రమోషన్స్, ప్రీ-ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ మరియు ఇతర సాంకేతిక వ్యయాలన్నీ కలిపి ఈ స్థాయిలో ఖర్చు అవుతోందని వివరించారు.ఒక హాలీవుడ్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను ఏ రీతిలో ప్లాన్ చేస్తారో, అదే తరహాలోనే 'రామాయణ' సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి మేకర్స్ ఖర్చు చేస్తున్నారని, అదే నమిత్ మల్హోత్రా వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని యశ్ స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమా బడ్జెట్‌పై ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న ఈ విజువల్ వండర్ మూవీ విడుదల తేదీ కూడా ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక 'రామాయణ' చిత్రం ఈ ఏడాది నవంబర్ 8న ఇండియా వ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.భారీ తారగణంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.