ఆస్తులు అడుగుతున్న రిషబ్ శెట్టి.. డైలమాలో రెండు బడా ప్రాజెక్టులు.. రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..?

కాంతార సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ నటుడు రిషబ్ శెట్టికి టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2026 | 06:00 PMLast Updated on: Jan 25, 2026 | 6:00 PM

Rishab Shetty Is Demanding Assets Two Big Projects Are In A Dilemma Is His Remuneration Really That Many Crores

కాంతార సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ నటుడు రిషబ్ శెట్టికి టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా ఘనవిజయం తర్వాత, తెలుగు అగ్ర నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీ పడ్డాయి. మరీ ముఖ్యంగా కథాబలం ఉన్న చిత్రాలను నిర్మించే సితార ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ వంటి సంస్థలు రిషబ్ శెట్టితో చర్చలు జరిపి.. ప్రాజెక్టులను ఖరారు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఫిల్మ్ నగర్ సమాచారం. దీనికి ప్రధాన కారణం రిషబ్ శెట్టి కోరుతున్న భారీ పారితోషికమేనని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, రిషబ్ శెట్టి ఒక్కో సినిమాకు ఏకంగా 75 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కేవలం ఒక్క సినిమాతోనే ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడం చూసి నిర్మాతలు షాక్ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ డిమాండ్ కారణంగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రిషబ్ శెట్టితో చేయాలనుకున్న ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్, రిషబ్ మార్కెట్, ఆయన అడుగుతున్న పారితోషికం లెక్కలు వేసుకుంటే.. ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాదని సితార సంస్థ భావిస్తోందని తెలుస్తుంది. ప్రస్తుతం కాంతారా 3 పనుల్లో బిజీగా ఉన్న రిషబ్.. ఆ తర్వాత తెలుగు సినిమా చేస్తారని ఆశించినా, బడ్జెట్ కారణాల వల్ల సితార వెనక్కి తగ్గినట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం మైత్రి మూవీ మేకర్స్ మీద కూడా పడింది. రిషబ్ శెట్టితో మైత్రి సంస్థ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాను ప్లాన్ చేసింది. కానీ సితార సంస్థ ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గడంతో.. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని వార్తలు వస్తున్నాయి.

అంత భారీ మొత్తం చెల్లించి సినిమా చేయడం రిస్క్ అని వాళ్ళు భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి కాంతార హీరో రేంజ్ పెరిగినా.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం టాలీవుడ్ నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రిషబ్ శెట్టి తన పారితోషికం విషయంలో వెనక్కి తగ్గుతారా? లేక ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు పూర్తిగా రద్దవుతాయా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం ఈ కన్నడ స్టార్ తెలుగు ఎంట్రీపై నీలినీడలు కమ్ముకున్నాయనే చెప్పాలి.