త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ హీరో నితిన్ ఖండించారు. త్రిషకు మద్దతు ప్రకటించారు. కాగా.. త్రిష, మన్సూర్ అలీఖాన్.. ఇద్దరూ కలిసి ఇటీవల విడుదలైన లియో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిషతో కలిసి స్క్రీన్‌పై నటించకపోవటంపై నిరాశను వ్యక్తం చేశాడు.
