బిగ్ బాస్ సీసన్ 10 సిద్ధం.. హోస్ట్‌ నాగార్జునపై విమర్శల వేడి!

బుల్లితెర హిట్‌ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీసన్ 10' ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, ఇప్పటికే ఆడిషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది.

Post Published By: dialnews
Updated : 6 July 2026, 3:59 PM IST

బుల్లితెర హిట్‌ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీసన్ 10' ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, ఇప్పటికే ఆడిషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే, ఒకవైపు సరికొత్త సీసన్‌పై భారీ అంచనాలు ఉండగా, మరోవైపు నాగ్ హోస్టింగ్ శైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో రాజకీయ నాయకులు, ప్రేక్షకుల నుంచే కాకుండా, ఇటీవల మాజీ కంటెస్టెంట్లు గీతూ రాయల్, సోనియా ఆకుల వంటి వారు కూడా నాగార్జున హోస్టింగ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. షో మొత్తం స్క్రిప్టెడ్ అని, హోస్ట్ ఎపిసోడ్లను పూర్తిగా చూడటం లేదని విమర్శలు గుప్పించారు. ఈ వివాదాల నడుమ రాబోయే సరికొత్త సీసన్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Published : 
  • 6 July 2026, 3:59 PM IST