కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ వర్కవుట్ అయిందా..?

వాలెంటైన్స్ వీకెండ్‌ని టార్గెట్ చేస్తూ యూత్ కోసం వచ్చిన లేటెస్ట్ సినిమా కపుల్ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రం ఆడియన్స్‌ని ఆకట్టుకుందా?

Post Published By: dialnews
Updated : 14 February 2026, 7:29 PM IST

వాలెంటైన్స్ వీకెండ్‌ని టార్గెట్ చేస్తూ యూత్ కోసం వచ్చిన లేటెస్ట్ సినిమా కపుల్ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రం ఆడియన్స్‌ని ఆకట్టుకుందా? ఈ ఫ్రెండ్లీ జర్నీ ఎంతవరకు సక్సెస్ అయ్యిందో పూర్తి రివ్యూలో చూద్దాం.కథ విషయానికి వస్తే.. శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనర్ కావాలనే కలలతో చెన్నైలో అడుగుపెడతాడు. కానీ పరిస్థితులు అనుకూలించక సర్వైవల్ కోసం బైక్ టాక్సీ నడుపుతుంటాడు. మరోవైపు మిత్ర (మానస వారణాసి) సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం సిటీలో స్ట్రగుల్ అవుతుంటుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల వీళ్లిద్దరూ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే రూమ్‌లో ఉండాల్సి వస్తుంది. వేర్వేరు గమ్యాలున్న వీరి ప్రయాణం ప్రేమగా ఎలా మారింది? ఫ్యామిలీ, సొసైటీ నుంచి వచ్చే ఒత్తిళ్లను వీరు ఎలా దాటారు? చివరికి వీరు ఒక్కటయ్యారా అనేది వెండితెరపై చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. సినిమాకి మెయిన్ పిల్లర్ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ. సంతోష్, మానస జోడీ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్‌గా, క్యూట్‌గా కనిపించారు. ప్రస్తుత కాలంలో యూత్ ఫేస్ చేసే జాబ్ స్ట్రగుల్స్, సిటీ లైఫ్, లివింగ్ టుగెదర్ వంటి అంశాలను డైరెక్టర్ చాలా రియలిస్టిక్‌గా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా బ్రీజీగా, ప్లెజెంట్‌గా సాగిపోతుంది. హీరో హీరోయిన్ల పరిచయం, వారి మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. అయితే కథ పరంగా కొత్తదనం ఆశించలేం. రెగ్యులర్ రొమాంటిక్ సినిమాల్లో చూసిన పాయింట్లే ఇందులోనూ కనిపిస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్పీడ్‌గా సెకండ్ హాఫ్ ఉండదు.

ఎమోషనల్ సీన్స్ కాస్త సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. టైటిల్‌కి న్యాయం చేస్తూ కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి, ఇవి ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బంది కలిగించొచ్చు. కానీ క్లైమాక్స్ ఎపిసోడ్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సినిమాకి మంచి వెయిట్ ఇచ్చాయి. యోగి బాబు కామెడీ అక్కడక్కడా రిలీఫ్ ఇస్తుంది. లాజిక్కులు పక్కన పెట్టి, ఒక క్యూట్ లవ్ స్టోరీ చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్. కొన్ని సీన్స్ మాత్రం కావాలనే రాసుకున్నాడు దర్శకుడు.. ఇంటర్వెల్ సీన్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పటి వరకు బాగానే సాగిన హీరో హీరోయిన్ రిలేషన్ మధ్య కావాలనే ఓ రిఫ్ట్ వచ్చేలా సీన్ క్రియేట్ చేసాడు. బ్రేక్‌కు ముందు ఓ ట్విస్ట్ ఉండాలి కాబట్టి అలా రాసుకున్నాడు అనేలా ఈ సీన్ ఉంటుంది. అంత హెవీ సీన్ రాసుకున్న తర్వాత.. సెకండాఫ్‌లో మళ్లీ సింపుల్ సీన్‌తో వాళ్లిద్దరినీ కలిపేస్తాడు దర్శకుడు. ఇలాంటి కొన్ని సిల్లీ సీన్స్ మినహాయిస్తే.. మిగిలిన సినిమా అంతా బాగానే ఉంటుంది.

నటీనటుల విషయానికి వస్తే.. సంతోష్ శోభన్ తన మార్క్ నాచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. పక్కింటి కుర్రాడి పాత్రలో చాలా ఈజీగా ఒదిగిపోయాడు. మానస వారణాసి కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనతోనూ మెప్పించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. యోగి బాబు తన స్టైల్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు.టెక్నికల్ టీం విషయానికి వస్తే.. ఆదిత్య రవీంద్రన్ అందించిన మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లలోని ఎమోషన్‌ని బాగా ఎలివేట్ చేసింది. దినేష్ సినిమాటోగ్రఫీ చెన్నై అందాలను కలర్‌ఫుల్‌గా చూపించింది. యూవీ క్రియేషన్స్ మేకింగ్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ పాత కథనే తీసుకున్నా, ట్రీట్‌మెంట్‌లో కొత్తదనం చూపిస్తూ మ్యాజిక్ చేశారు.ఓవరాల్‌గా చెప్పాలంటే కపుల్ ఫ్రెండ్లీ.. రొటీన్ స్టోరీనే అయినా, ఫ్రెష్ ఫీల్ ఇచ్చే డీసెంట్ లవ్ ఎంటర్టైనర్..!

Published : 
  • 14 February 2026, 7:29 PM IST