పవన్ ఫ్యాన్స్ కి పండగ రోజులు, షూటింగ్ కి పవన్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయిపోతారు. అది హిట్టా ఫట్టా అనే దానితో సంబంధం లేకుండా ఆయన ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు.

Post Published By: Vencateshg
Updated : 16 August 2024, 10:37 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయిపోతారు. అది హిట్టా ఫట్టా అనే దానితో సంబంధం లేకుండా ఆయన ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన... సినిమాల సంగతి ఏంటీ అనే దానిపై అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. కాని మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒక్క సినిమా కూడా ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు లేవు.

హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఇప్పుడు లైన్ లో పెట్టాడు. ఈ మూడు సినిమాలలో ఒక్క సినిమా ఈ ఏడాది విడుదల అవుతోందని అందరూ భావించారు. కాని ఒక్కటి కూడా వచ్చే సూచనలు లేవు. కారణం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటమే. అలాంటి పవన్ ఇప్పుడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్దమయ్యారు. ఇక థియేటర్ల దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికి సిద్దం కావాలనే సంకేతాలు ఇచ్చేసాడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రెండూ ఒకసారే షూట్ చేస్తా అని డైరెక్టర్లకు ఫోన్ చేసినట్టు సినీ వర్గాలు అంటున్నాయి.

డిసెంబర్ లో ఒక సినిమా విడుదల చేసి వచ్చే ఏడాది మే లో ఒక సినిమా విడుదల చేసే ప్లాన్ చేసుకోవాలని డైరెక్టర్స్ కి క్లారిటీ ఇచ్చేసాడు. వచ్చే నెల చివరి వారం నుంచి షూట్ కి హాజరు అవుతా అని పవన్ స్వయంగా డైరెక్టర్ లకు చెప్పడంతో వాళ్ళు ఇప్పుడు సినిమా కథలను మరింత పవర్ ఫుల్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ లో హరిహర వీరమల్లు పక్కాగా విడుదల చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి. వారంలో మూడు రోజులు సినిమాలకు టైం కేటాయించాలని పవన్ భావిస్తున్నారట. దీనితో డైరెక్టర్స్ ఇప్పుడు యుద్దానికి సిద్దమవుతున్నారు.

Published : 
  • 16 August 2024, 10:37 AM IST