Hero Jr.NTR: విలన్ గా యంగ్ టైగర్.. ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా హీరో అయ్యాడు. కొరటాల శివ మేకింగ్ లో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేశాడు. అంతా బానే ఉంది. హీరోగా ఇండియన్ మార్కెట్ ని ఊపేసే టైంలో తను సడన్ గా విలన్ గా మారడు. విలన్ గా ఫ్యాన్స్ భయపడే రేంజ్ లో కెరీర్ తో రిస్క్ చేస్తున్నాడు.

Post Published By: Srikar Creator
Updated : 17 April 2023, 6:30 PM IST

చరణ్, బన్నీ, ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ని కబ్జా చేసి ఆ మార్కెట్ లో శాశ్వితంగా జెండా పాతేసే పనిలో ఉన్నారు. అలా తోటి హీరోలు దూసుకెళుతుంటే, ఇప్పటికే ఏడాది టైం తీసుకున్న ఎన్టీఆర్, విలన్ అవతారం ఎత్తనున్నాడనే మాట తెలిసి జనం షాక్ అవుతున్నారు

అంటే ఎవరో హీరోగా నటించే మూవీలో విలన్ గా తారక్ చేయట్లేదు. కొరటాల శివ మూవీ లో తారక్ వేసేది పూర్తిగా విలన్ రోలట. అందులో విలన్ ని చంపేందుకు ఓ ఊరి జనం చేసే ప్రయత్నమే ఈ సినిమా కథని తెలుస్తోంది. ఓరకంగా రాముడు లేని యుద్దంలో రావణుడి సంహారం అని ప్రచారం జరుగుతోంది. అంటే జై లవకుశలో రావణుడి పాత్ర వేసిన ఎన్టీఆర్ రోలే ఇక్కడ రిపీట్ అవుతోందా అన్న అనుమానాలు పెరిగాయి. ఏదేమైనా తారక్ ఈ సారి పూర్తి స్థాయి విలన్ గా కనిపించనున్నాడనే లీకులు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

Published : 
  • 17 April 2023, 6:30 PM IST