సినిమా చూసి మాట్లాడండీ..!

కెజియఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ సూపర్ స్టార్ యష్, చాలా కాలం తర్వాత నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్'. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా

Post Published By: dialnews
Updated : 17 August 2026, 6:10 PM IST

కెజియఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ సూపర్ స్టార్ యష్, చాలా కాలం తర్వాత నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్'. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్స్, టీజర్లలోని కొన్ని బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు, చర్చలు మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో హీరో యష్ స్వయంగా స్పందించి, విమర్శకులకు మరియు సాధారణ సినీ అభిమానులకు అర్థమయ్యే రీతిలో స్పష్టమైన వివరణ ఇచ్చారు.

'టాక్సిక్' టీజర్లు మరియు పాటల గ్లింప్సెస్ విడుదలైన తర్వాత, అందులో ఉన్న కొన్ని బోల్డ్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సినిమాలో అసభ్యత ఎక్కువగా ఉందనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఒక మహిళా దర్శకురాలు తెరకెక్కిస్తున్న సినిమాలో ఇలాంటి సన్నివేశాలు అవసరమా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఈ విమర్శలన్నింటిపై రాకింగ్ స్టార్ యష్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా స్పందించారు. నేను అశ్లీలతను ఎప్పుడూ ప్రోత్సహించను" "నేను ఎప్పుడూ సమాజానికి చెడు సందేశాన్ని ఇచ్చే అసభ్యకరమైన సన్నివేశాలను సమర్థించను. అసభ్యత అనేది తప్పు అని నేను కూడా నమ్ముతాను" అని యష్ అన్నారు. సాధారణ ప్రేక్షకులు ఆలోచిస్తున్నట్లు ఈ సినిమాలో ఎలాంటి సీన్లూ లేవని చెప్తూ— "ఈ సినిమాలో నేను కనీసం ఒక్క కిస్ సీన్ లో కూడా నటించలేదు" అని స్పష్టం చేశారు. టీజర్‌లోని 2-3 సెకన్ల విజువల్స్ లేదా బిట్‌లు చూసి మొత్తం సినిమా అసభ్యంగా ఉంటుందని భావించడం పొరపాటని ఆయన తెలిపారు.

డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ప్రతి సన్నివేశాన్ని చాలా అందంగా, కళాత్మకంగా చిత్రీకరించారని యష్ తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు ఆ సన్నివేశాల వెనుక ఉండే భావోద్వేగం, సందర్భం అర్థమైతే ఎవరికీ అది తప్పుగా అనిపించదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా కేవలం మాస్ యాక్షన్ లేదా గ్లామర్ కోసమే తీసింది కాదు. నేటి తరం ఆలోచనలకు, పాత తరం వారి కట్టుబాట్లకు మధ్య ఉండే ఆలోచనా వ్యత్యాసాన్ని ఇందులో ప్రధానంగా చూపించబోతున్నారు. "నేటి యువత పాత తరం నియమాలను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వారి ప్రశ్నలలో ఉన్న నిజాయితీ ఏంటి?" అనే అంశాలను ఆసక్తికరమైన కథతో తెరకెక్కించారు.ఈ నెల 26వ తేదీన విడుదల కానున్న 'టాక్సిక్' చిత్రానికి మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Published : 
  • 17 August 2026, 6:10 PM IST