RRR- Anne Hathway : ‘ఆర్.ఆర్.ఆర్’ని పొగడ్తలతో ముంచెత్తిన హాలీవుడ్ నటి

ఆర్ఆర్ఆర్ రణం, రుధిరం, రౌద్రం.. ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ భారతీయ సినీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 May 2024, 4:11 PM IST

 

 

 

ఆర్ఆర్ఆర్ రణం, రుధిరం, రౌద్రం.. ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ భారతీయ సినీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఆస్కార్ ని కూడా సాధించి ప్రపంచ సినిమా ముందు నిలబడింది. అది ఎంతలా అంటే 2022 లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ని మనం అయినా మర్చిపోయామేమో గాని హాలీవుడ్ మర్చిపోలేదు. ఇందుకే నిదర్శనమే తాజా సంఘటన

అన్నే హాత్ వేఅమెరికా కి చెందిన ఈ నటి హాలీవుడ్ సినీ రంగంలో ఎంతగానో పేరు మోసిన నటి. సిల్వర్ స్క్రీన్ వద్ద ఆమె చూడని విజయం లేదు. ఆమె అందానికి ఫిదా కానీ సినీ ప్రేమికుడు కూడా లేడు. 2001 లో వచ్చిన ది ప్రిన్సెస్ ఆఫ్ డైరీస్ తన మొదటి సినిమా. అప్పుడు ఆమె వయసు పద్దెనిమిదేళ్లు. ది అదర్ సైడ్ ఆఫ్ ఎవన్, ది క్యాట్ రిటర్న్స్, హెవోక్, గెట్ స్మార్ట్, వన్ డే, బ్రైడ్ వార్స్, రియో టూ, ది విచెస్ ఇలా సుమారు ముప్పై కి పైగా చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా ది ఐడియా ఆఫ్ యు, వచ్చి ఇప్పుడు ఫ్లవర్ వెల్ స్ట్రీట్ తో ముస్తాబవుతోంది. ఇప్పుడు ఈ భామ ఆర్ ఆర్ఆర్ గురించి మాట్లాడుతు తనకి కూడా ఆర్ ఆర్ ఆర్ అందరిలాగే ఎంతగానో నచ్చింది. ఆ సినిమాలో చేసిన వాళ్ళతో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది

ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ చరణ్ అండ్ ఎన్టీఆర్ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది. .పైగా తెలుగు సినిమా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ సినిమాగా కూడా మారుతున్న టైంలో ఆమె కోరిక కూడా నెరవేరవచ్చు. కానీ ఇద్దరిలో ఎవరితో సెట్ అవుతుందో చూడాలి. గతంలో కూడా ఎంతో మంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ ని పొగిడారు.జేమ్స్ కెమెరూన్ (James Cameron) వంటి ప్రపంచం గర్వించదగ్గే దర్శకుడు కూడా ఆ లిస్ట్ లో ఉన్నాడు

Published : 
  • 24 May 2024, 4:11 PM IST