10,000 కోట్ల కోసం ఆంటార్కిటికాలో.. ఫస్ట్ మూవీగా…!

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న వారణాసి ఏప్రిల్ 7 విడుదలంటూ ఏకంగా కాశీలో హోర్డింగ్స్ కనిపించాయి.

  • Written By:
  • Publish Date - January 31, 2026 / 11:12 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న వారణాసి ఏప్రిల్ 7 విడుదలంటూ ఏకంగా కాశీలో హోర్డింగ్స్ కనిపించాయి.. కాని రాజమౌళి టీం మాత్రం అఫీషియల్ గా ఎలాంటి ఎనౌన్స్ చేయలేదు. ఇలాంటి టైంలో సడన్ గా సినిమాటోగ్రాఫర్ ఈ మూవీ కోసం జార్జియా బయలు దేరాడు.. కట్ చేస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అంటార్కిటీకాలో తెరకెక్కిన హిస్టరీ మాత్రం వారణాసికే దక్కబోతోంది. అంటే ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఇండియన్ మూవీ కూడా అంటార్కిటికా మంచుఖండంలో తెరకెక్కలేదా అంటే లేనేలేదు.. ఇది ఫస్ట్ మూవీ… అంతేకాదు ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ కూడా ఇదే.. దీనికి తోడు ఇండియన్ తరపునే కాదు, వరల్డ్ వైడ్ గా కూడా 55 వేల థియేటర్స్ లోరిలీజ్ అయిన రికార్డు ఏ హాలీవుడ్ మూవీకి దక్కలేదు. ఆ రికార్డు కూడా వారణాసి ఎకౌైంట్ లో పడబోతోంది… సినిమాలో కంటెంటే కాదు, రిలీజ్ డేట్ తో కూడా రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది వారణాసి.

వారణాసి మూవీ రిలీజ్ కి ఏడాది ముందే దేశాన్ని కుదిపేసేలా ఉంది.అలా అనిపించటానికి కారణం, వారణాసి మూవీ రిలీజ్ పోస్టర్ కాశీలో కనిపించటమే.. ఎక్కడా రాజమౌళి కాని, తన టీం కాని ఏప్రిల్ 7న వారణాసి మూవీ రిలీజ్ అని చెప్పలేదు. కాని ఆ కాశీ విశ్వేశ్వరుడి నగరంలో మాత్రం 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ అని చాలా హోర్టింగ్స్ కనిపించాయి.నేషనల్ మీడియా అయితే ఇదేం సర్ ప్రైజ్ అని షేక్ అయ్యింది. అయినా జక్కన్న టీం నుంచి రెస్పాన్స్ లేదు.. ఇలాంటి టైంలో మరో అణుబాంబు లాంటి వార్త… ప్రపంచంలోనే మంచుతో కప్పేయబడిన ఖండం అంటార్కిటికాలో ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది.

ఇలాంటి లొకేషన్ లో ఇంతవరకు ఒక్క ఇండియన్ సినిమాకూడా షూటింగ్ జరుపుకోలేదు. హాలీవుడ్ కూడా వేల్ల మీద లెక్కపెట్టేన్ని సినిమాలే చేసింది… అలా అంటార్కిటికాలో తెరకెక్కబోయే ఐదో సినిమాగా వారణాసి హిస్టరీలో నిలిచిపోయేలా ఉంది.ఆల్రెడీ ఐమ్యాక్స్ కెమెరాతో త్రీడీ ఎఫెక్ట్ తో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీగా వారణాసి హిస్టరీ క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స లో రిలీజ్ కాబయే తొలి భారతీయ సినిమా కూడా ఇదే. అంతే కాదు 30భాషల్లో 120 దేశాల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా ఈ సినమా రాబోతోంది. ఇక హాలీవుడ్ లో కూడా ఏసినిమా కూడా 30వేల థియేటర్స్ ని మించి రిలీజ్ కాలేదు.

అలాంటిది ఒక భారతీయ సినిమా, అందులోనూ ఒక తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతోందంటేనే అదో హిస్టారికల్ రికార్డు.. ఇలా తవ్వే కొద్ది వారనాసి మూవీ కంటెంట్ కంటే ముందు, అదర్ యాక్టివిటీస్ తోనే వరల్డ్ మీడియా అటెన్షన్ లాక్కుంటోంది. అత్యంత కటినమైన వాతావరనంలో, సైంటిస్టులు మాత్రమే పనిచేసే అంటార్కిటికాలో షూటింగ్ అంటే అదో సెన్సేషన్ అవుతోంది.కేవలం వరల్డ్ మీడియా అటెన్షన్ లాక్కోడానికే రాజమౌలి ఇలాంటి సాహసాలు చేస్తున్నాడని అంటున్నా, కథతో లింక్ లేకుండా తనలాంటి ప్రయత్నం చేస్తాడనుకోలేం. అంతేకాదు జార్జియాలో కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం వారాణీసి సినిమాటోగ్రఫి టీం, జార్జియా బయలు దేరింది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ అనుకుంటే, ఆ వారంలో వరుసగా దేశ వ్యాప్తంగా కనీసం వారంరోజులు సెలవులు కనిపిస్తున్నాయి.. ఉగాది, శ్రీరామనవమి ఇలా చాలా పండగలు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాకు ప్లస్ అవుతుంటే, ఆ సీజన్ హాలీవుడ్ సినిమాల ఎటాక్ తక్కువ ఉండటంతో, వరల్డ్ మార్కెట్ లో కూడా వారణాసికి కలిసొచ్చేలా ఉంది.