మెగాస్టార్ గ్యారేజ్‌లో 369 మ్యాజిక్.. ఆ నెంబర్ వెనుక ఉన్న అసలు కథ ఇదే.. అన్ని కార్లకు అదే నెంబర్..!

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు, లక్కీ నెంబర్లు చాలా కామన్. మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి 9999, మెగాస్టార్ చిరంజీవికి 1111 అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. వాళ్ళు ఏ కారు కొన్నా అన్నిటికీ అదే నెంబర్ ఉంటుంది.

Post Published By: dialnews
Updated : 9 February 2026, 12:09 PM IST

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు, లక్కీ నెంబర్లు చాలా కామన్. మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి 9999, మెగాస్టార్ చిరంజీవికి 1111 అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. వాళ్ళు ఏ కారు కొన్నా అన్నిటికీ అదే నెంబర్ ఉంటుంది. లక్షలకు లక్షలు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కట్టి మరీ తమ బళ్ళు మొత్తానికి ఆ నెంబర్స్ ఉండేలా చూసుకుంటారు. అలాగే బాలీవుడ్ బాద్‌షాల నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ వరకు ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ అంటే పిచ్చి ప్రేమ. అయితే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి మాత్రం 369 అనే నెంబర్ అంటే ప్రాణం. దశాబ్దాలుగా ఆయన గ్యారేజ్‌లోని కార్ల నెంబర్ ప్లేట్లపై ఈ సంఖ్యే రాజ్యమేలుతోంది. అసలు ఈ నెంబర్ వెనుక ఉన్న కథేంటి? ఎందుకింత ప్రత్యేకత? అనేది చాలామందికి తెలియదు.

ఈ ‘369’ బంధం ఇప్పటిది కాదు. మమ్ముట్టి తన కెరీర్ మొదట్లో ఉన్నప్పుడు ఒక బ్రీఫ్‌కేస్ కొనుక్కున్నారు. యాదృశ్చికంగా ఆ బ్రీఫ్‌కేస్ లాక్ కోడ్ ‘369’గా వచ్చింది. ఆ పెట్టె తన చేతికి వచ్చాక కెరీర్ ఊపందుకుందని, అది తనకు కలిసొచ్చిందని ఆయన బలంగా నమ్మారు. అప్పటి నుంచి ఆ మూడు అంకెలు ఆయన జీవితంలో, విజయ ప్రస్థానంలో విడదీయలేని భాగమైపోయాయి. కార్లంటే మమ్ముట్టికి విపరీతమైన క్రేజ్. మారుతి 800 నుంచి ఖరీదైన పోర్షే, ఆడి, జాగ్వార్ వరకు ఆయన గ్యారేజ్‌లో ఎన్నో కార్లు మారాయి. కానీ మారనిది మాత్రం రిజిస్ట్రేషన్ నెంబరే..! ఆయన ఏ కొత్త కారు కొన్నా రిజిస్ట్రేషన్ నెంబర్ ‘369’ ఉండాల్సిందే. కేవలం కార్లు మాత్రమే కాదు, షూటింగ్ కోసం వేరే ఊరు వెళ్తే హోటల్ రూమ్ నెంబర్ కూడా ‘369’ ఉండేలా చూసుకుంటారు. అంతలా ఈ నెంబర్‌తో ఆయన ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.

ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రీల్ లైఫ్‌లో కూడా ఈ నెంబర్ మ్యాజిక్ రిపీట్ అయ్యింది. మమ్ముట్టి కెరీర్‌లో నటించిన 369వ చిత్రం ‘ఉండ’. ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. తన లక్కీ నెంబరే ల్యాండ్‌మార్క్ సినిమాగా రావడం, అది హిట్ అవ్వడం నిజంగా విశేషం. ప్రస్తుతం ఆయన 400లకు పైగా సినిమాల్లో నటించి, ఇండియన్ సినిమా లెజెండ్స్‌లో ఒకరిగా దూసుకుపోతున్నారు. మొత్తానికి స్టార్ హీరోల సెంటిమెంట్ల లిస్ట్‌లో మమ్ముట్టి ‘369’ స్టోరీ చాలా యూనిక్. అది కేవలం మూఢనమ్మకం మాత్రమే కాదు.. అదొక బ్రాండ్ అండ్ స్టైల్ స్టేట్‌మెంట్ కూడా. ఫ్యాన్స్ కూడా ఇప్పుడు 369 కనిపిస్తే చాలు, ఠక్కున తమ అభిమాన నటుడు మమ్ముట్టిని గుర్తు చేసుకుంటున్నారు. కెరీర్ ఆరంభం నుంచి నేటి వరకు ఆ నెంబర్‌ను వదలకపోవడం ఆయన స్థిరమైన మనస్తత్వానికి నిదర్శనం.

Published : 
  • 9 February 2026, 12:09 PM IST