ఫస్ట్ టైం రివర్స్ హీరోయిజం.. హాలీవుల్ లో పాత్రతో…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ లో ఇంతవరకు ఎన్నడూ వేయని పాత్రవేయబోతున్నాడా? మొన్నటి వరకు ఇదో మాఫియా డాన్ కథన్నారు.

  • Written By:
  • Publish Date - January 25, 2026 / 10:53 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ లో ఇంతవరకు ఎన్నడూ వేయని పాత్రవేయబోతున్నాడా? మొన్నటి వరకు ఇదో మాఫియా డాన్ కథన్నారు. నార్త్ ఈస్ట్ ఇండియా బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న తొలి ఇండియన్ సినిమా అని కూడా అన్నారు. అందుకే టైటిల్ గా డ్రాగన్ పేరు పెట్టారు. ఇందులో చాలా విషయాలు నిజమే కాని, కొత్త విషయం రివర్స్ హీరోయిజం… ఎన్టీఆర్ ఇంతవరకు హీరోగా నటించాడు.. లేదంటే విలన్ గా జైలవకుశలో వణికించాడు.. కాని ఎన్నడూ రివర్స్ హీరోయిజం అన్న పాయింట్ ని టచ్ చేయలేదు… ఇది హాలీవుడ్ నటుడు క్లిన్ మర్ఫీ చేసిన పీకీ బ్లెండర్స్ నుంచి ప్రేరణతో రెడీ చేసిన పాత్రని తెలుస్తోంది… అంటే ఇది హీరో పాత్రాకాదా? అంటే కాదనలేం.. అలాని విలన్ పాత్ర కాదా అంటే అది కూడా కాదనలేం.. మరి రెండీంటికి మధ్యలో ఉన్న ఆ హీరోయిజం ఎందుకు అంత స్పెషల్… డ్రాగన్ ని యూరప్, చైనా, కొరియా అంతటా ఆడాలంటే అలాంటి మ్యాజిక్ ఏదో చేస్తేనే వరల్డ్ ఆడియన్స్ ఇటువైపు చూస్తారా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన డ్రాగన్ మూవీని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడా? రాజమౌళి ఎలాగౌతే బాహుబలితో పాన్ ఇండియా గోడను బద్దలు కొట్టాడో.. అచ్చంగా అలానే పాన్ ఇండియా లెవల్లో అాదే స్థాయిలో దూసుకెళ్ళాడు ప్రశాంత్ నీల్. కేజీయఫ్ కూడా బాహుబలి రేంజ్ లోనే దూసుకెళ్లింది.. సో ఇప్పుడు పాన్ వరల్డ్ మార్కెట్ లో కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతున్నట్టుంది…ఐతే మన కంఫర్ట్ జోన్ దాటి కొత్త మార్కెట్లో అడుగుపెట్టాలంటే ఆ సినిమా ఏదో అద్భుతం చేయాలి… అలాంటి కంటెంట్ తో వెలితేనే, పాన్ వరల్డ్ ఆడియన్స్ ని ఇండియన్ సినిమా రీచ్ అవుతుంది. అందుకోసం ఆల్రెడీ డ్రాగన్ టీం, దానికి తగ్గట్టే కథ, కథనాలు ఎంచుకున్నా, బ్యాగ్రౌండ్ మాత్రం అంతకుమించేలా ఉంది. నార్త్ ఈస్ట్ ఇండియా డ్రగ్ మాఫియా…దాంతో మలేసియా, ఇండోనేషియా,కొరియా, చైనా, జపాన్ కి ఉండే కనెక్షన్స్ వల్ల ఈ సినమా సౌత్ ఏసియా రీచ్ పెరుగుతుంది.

అక్కడి నటుల వల్ల కథ ఏమాత్రం కనెక్ట్ అయినా, సౌత్ ఆసియాలో డ్రాగన్ జోరుకి దారి దొరికినట్టే… ఇక అమెరికన్స్, యూరోపియన్స్ ని డ్రాగన్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి…? అక్కడే హాలీవుడ్ స్టార్ క్లేన్ మార్ఫీ ఫేట్ మార్చిన ఒక వెబ్ సీరీస్ లో పాత్రనే ప్రేరణగా పొందిందట డ్రాగన్ టీం… పీకీ బ్లెండర్స్ గా ఓటీటీని కుదిపేసిన బ్రిటన్ గ్యాంగ్ స్టర్స్ డ్రామాలో…క్లిన్ మర్ఫీ వేసిన డాన్ పాత్ర ఒక రకంగా రివర్స్ హీరోయిజంతో నడుస్తుంది.. అంటే తను మంచివాడే.. అలాని మంచివాల్లకి ఏదో చేస్తాడనలేం… చెడ్డవాడే కాని, పనికట్టుకుని చెడుచేస్తాడనుకోలేం… ఒక చెడ్డ పనుల చేసే మంచివాడు.. మంచి పనులు చేసే చెడ్డవాడు… కాని పూర్తిగా రాబిన హుడ్ తరహా పాత్ర అయితే కాదు… దీన్ని బేస్ చేసుకునే గతంతో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ లో రాకీ భాయ్ పాత్రకి క్రియేట్ చేశాడు.

కాని అందులో హీరో పూర్తిగా చెడ్డవాడో, మంచివాడో ఏదో ఒక సైడ్ కి వెళ్లినట్టు పాత్ర కనిపించింది. కాని డ్రాగన్ లో హీరో బ్రూటల్ విలన్ గా, సూపర్ హీరోగా రెండు ఎక్స్ ట్రీమ్ షేడ్స్ లో ఉండబోతున్నాడట. నిజానికి ఈ తరహా పాత్రలే హాలీవుడ్ ఆడియన్స్ కి ఈజీగా ఎక్కేస్తాయి.. కాబట్టే ఆ పాత్రని బేస్ చేసుకుని పాన్ వరల్డ్ మార్కెట్ గోడలు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్..వారాణాసిలో ఎన్నో వింతలు విశేసాలు, భారీ యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్స్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ ని గురిపెట్టాడు రాజమౌలి. తనకంటే ముందే అంతకుమించేలా పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేసేందుకు రివర్స్ హీరోయిజాన్నే ఆయుధంగా మార్చుకున్నాడు ప్రశాంత్ నీల్… అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫేట్ ని పాన్ వరల్డ్ మార్కెట్ లో మార్చే అవకాశం ఉంది.