తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో, అందంతో ఎంతగానో ఆకట్టుకున్న నటి శోభా శెట్టి. ముఖ్యంగా 'కార్తీక దీపం' సీరియల్లో ఆమె పోషించిన 'మోనిత' పాత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని అందమైన చీరకట్టు ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.బుల్లితెరపై విలనిజంతో మెప్పించి, బిగ్ బాస్ షోతో రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను పరిచయం చేసి, లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి శోభా శెట్టి. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ కన్నడ కస్తూరి, తాజాగా ఒక అందమైన ఆకుపచ్చ రంగు శారీలో సరికొత్త ఫోటోషూట్ చేసి నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌గా మారాయి.
శోభా శెట్టి గురించి కొత్తగా బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోయిన్స్ ఉన్న స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. ట్రెడిషనల్ వేర్ అయినా, మోడరన్ డ్రెస్ అయినా సరే... శోభా శెట్టి తనదైన శైలిలో క్యారీ చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.బుల్లితెర చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన 'కార్తీక దీపం' సీరియల్లో మోనిత పాత్ర ఎంత పాపులరో తెలుగు ప్రేక్షకులందరికీ విదితమే. డాక్టర్ బాబు, వంటలక్కల మధ్య వచ్చే ఈ మోనిత క్యారెక్టర్‌ను బుల్లితెర ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు. అసలు బుల్లితెర ప్రేక్షకులు ఎన్నిసార్లు శోభాను తిట్టుకున్నారో లెక్కేలేదు. నెగెటివ్ పాత్రలో అంతగా మెప్పించడం కేవలం శోభా శెట్టికే సాధ్యమైంది. ఈ సీరియల్ ద్వారా ఆమె తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' లో అడుగుపెట్టి.. తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుని మరింత క్రేజ్ సంపాదించుకుంది. హౌస్‌లో తనదైన స్ట్రైట్ ఫార్వర్డ్ గేమ్ ప్లేతో, ఎమోషన్స్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
బిగ్ బాస్ ఫైనల్స్ కు వారం ముందు వరకు వెళ్లి ఎలిమినేట్ అయ్యింది శోభా శెట్టి. అయితే, షో నుండి బయటకు వచ్చిందో లేదో... శోభా శెట్టిని 'రాష్ట్రీయ గౌరవ్ అవార్డు' వరించడం గమనార్హం. ఇది ఆమె పాపులారిటీకి ఒక నిదర్శనంగా నిలిచింది. శోభా శెట్టి కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలోని కొన్ని సీరియల్స్‌తో పాటు అనేక సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది మోనిత. ఇలా రెండు పరిశ్రమలలోనూ రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. సోషల్ మీడియాలో నిత్యం తన లేటెస్ట్ అప్డేట్స్ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఆకుపచ్చ చీరలో, చెవులకు పెద్ద జుక్కాలు పెట్టుకుని, పెదవులపై చిరునవ్వుతో మెరిసిపోతున్న శోభా శెట్టి తాజా ఫోటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. వెండితెర హీరోయిన్లకు పోటీగా ఉన్న ఈమె గ్లామర్ చూస్తుంటే, త్వరలోనే శోభా శెట్టి కి సినిమాల్లో కూడా మరిన్ని క్రేజీ ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.