ఫోన్ వాడకంతో నరాల బలహీనత.!

ఈ రోజుల్లో పొద్దున్న లేచింది మొదలు రాత్రి కళ్లు మూసే వరకు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. రాత్రి నిద్రపోకుండా గంటల తరబడి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు, గేమ్‌లు చూడటం చాలామందికి వ్యసనంగా మారింది.

Post Published By: dialnews
Updated : 14 August 2026, 6:20 PM IST

ఈ రోజుల్లో పొద్దున్న లేచింది మొదలు రాత్రి కళ్లు మూసే వరకు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. రాత్రి నిద్రపోకుండా గంటల తరబడి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు, గేమ్‌లు చూడటం చాలామందికి వ్యసనంగా మారింది. కానీ, అలా పడుకుని ఫోన్ వాడితే ఏం జరుగుతుందో తెలుసా? ఏకంగా ఆసుపత్రి పాలై, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది!
అవును.. సరిగ్గా ఇలాంటి తీవ్రమైన పరిస్థితినే ఎదుర్కొన్నారు సౌత్ ఇండియా పాపులర్ యాక్ట్రెస్ షకీలా.నటి షకీలా నిరంతరం ఫోన్ వాడటం, ముఖ్యంగా పడుకునే సమయంలో గంటల తరబడి ఫోన్‌లో గేమ్‌లు ఆడటం, వీడియోలు చూడటం చేసేవారు. ఇలా నిరంతరం మెడ వంచి గంటల కొద్దీ ఫోన్ వైపే చూడటం వల్ల ఆమె మెడలోని నరాలపై తీవ్రమైన ప్రాబ్లమ్ వచ్చి, విపరీతమైన నొప్పితో బాధపడ్డారు.

డాక్టర్లు పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పడంతో, దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు చేసి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె మెడకు బెల్ట్ పెట్టుకుని కోలుకుంటున్నారు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సర్జరీ తర్వాత కోలుకుంటున్న షకీలా అభిమానులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు.ఫోన్ అనేది అవసరమే, కానీ దానికి బానిసలు కావొద్దు. రాత్రిళ్ళు అనవసరంగా ఫోన్ చూస్తూ సమయాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దు. దీనివల్ల డబ్బు పోవడమే కాకుండా భరించలేని నరకయాతన అనుభవించాలి. ముఖ్యంగా మీ పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి వదిలేయకండి, వారిని ఎప్పటికప్పుడు గమనించండి' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం 18 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి వచ్చి, 'కిన్నెర తుంబికల్' అనే సినిమాతో రాత్రికి రాత్రే కల్ట్ స్టార్‌గా మారిపోయారు. అప్పట్లో మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి బడా హీరోల సినిమాలు కూడా షకీలా సినిమాల దెబ్బకి బాక్సాఫీస్ వద్ద వాయిదా పడేవి అంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె సినిమాలు... ఇండియాలోనే కాకుండా నేపాల్, శ్రీలంక భాషల్లోకి కూడా డబ్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత సినిమాలకు దూరమై, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి మన 'బిగ్‌బాస్ తెలుగు 7' షోతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను అలరించారు.
మనం రోజూ చేతిలో పట్టుకునే చిన్న స్మార్ట్‌ఫోన్, మనకు తెలియకుండానే మన కంటికి, నరాలకు ఎంతటి నష్టం చేస్తుందో షకీలా సంఘటన మనకు కన్నువిప్పు కలిగిస్తోంది.సినిమాలు, గేమ్‌లు, సోషల్ మీడియా రీల్స్ మన జీవితంలో క్షణకాలం ఇచ్చే వినోదం మాత్రమే! కానీ మన ఆరోగ్యం, మన కుటుంబం శాశ్వతం. లక్షల రూపాయలు ఖర్చు చేసినా తిరిగి రాని ఆరోగ్యాన్ని ఈ డిజిటల్ వ్యసనం కోసం బలి చేయకండి అని సినీ విశ్లేషకులతో పాటు ఆరోగ్య నిపుణులు కోరుకుంటున్నారు.

Published : 
  • 14 August 2026, 6:20 PM IST