నా అసలు పేరు తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్‌గా పేరు తెచ్చుకున్న నిత్యా మీనన్ తన అందం మరియు అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.నాని హీరోగా నటించిన 'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు,

Post Published By: dialnews
Updated : 4 September 2026, 4:10 PM IST

సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్‌గా పేరు తెచ్చుకున్న నిత్యా మీనన్ తన అందం మరియు అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.నాని హీరోగా నటించిన 'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు, ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.అయితే ఈ మధ్యకాలంలో సినిమాల స్పీడ్ తగ్గించి, ఎంతో అచి తూచి ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నట్లు ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

తాజాగా ఆమె తన పేరు గురించి చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు, ఎందుకంటే అందరూ భావిస్తున్నట్లుగా తన అసలు పేరు 'నిత్యా మీనన్' కాదని ఆమె స్పష్టం చేశారు.చాలామంది తనను మలయాళీ భామ అని భావిస్తుంటారని, అలా అనుకుంటున్నప్పుడు తనకు ఎంతో నవ్వొస్తుందని ఆమె సరదాగా పంచుకున్నారు.ధనుష్ సరసన 'తిరు' చిత్రంలో నటించి జాతీయ అవార్డు అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తన అసలు పేరుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.నిత్యా మీనన్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి అయ్యర్ వర్గానికి చెందిన వారని, తల్లి మీనన్ వర్గానికి చెందినవారని వెల్లడించారు.ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో తన పేరిట ఎలాంటి కులం ఉండకూడదని ఆమె తల్లిదండ్రులు భావించి ఎన్.ఎస్.నిత్య అనే పేరును ఖరారు చేశారట.

అందులో 'ఎన్' అంటే తల్లి పేరు నళిని అని, అలాగే 'ఎస్' అంటే తండ్రి పేరు సుకుమార్ అని ఆమె వివరంగా అందరికీ అర్థమయ్యేలా తెలియజేశారు.తమ కుటుంబంలో ఇంటిపేర్లను వాడే అలవాటు లేదని మరియు పేర్లతో కులాన్ని ముడిపెట్టడం తమ ఇంట్లో ఎప్పుడూ ఇష్టపడరని ఆమె స్పష్టం చేశారు.అయితే వృత్తిరీత్యా దేశవిదేశాలు విసృతంగా తిరగాల్సి రావడంతో, పాస్‌పోర్ట్ నిబంధనల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తన పేరు చివర 'మీనన్'ను జత చేసినట్లు ఆమె వివరించారు.అలా అధికారిక పత్రాల నిమిత్తం తన పేరుకు మీనన్ అనే రెండో పేరు వచ్చి చేరిందని, అసలు కుటుంబసభ్యులు తనకు పెట్టిన పేరు మాత్రం 'ఎన్.ఎస్.నిత్య' మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు.

Published : 
  • 4 September 2026, 4:10 PM IST