Pawan Kalyan: ముఠామేస్త్రీ మూవీ స్టోరీ లైన్‌తో పవన్ సినిమా..?

సురేందర్ రెడ్డి తీయబోయే సినిమా అసెంబ్లీ రౌడీలాంటిదే. ఓ రౌడీ.. ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందని అసెంబ్లీ రౌడీ సినిమాలో చూపించారు. కాని ఇక్కడ ఓ రౌడీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసే సామాన్యుడిగా పవన్ కనిపిస్తాడట.

Post Published By: narender Thiru
Updated : 14 September 2023, 5:13 PM IST

Pawan Kalyan: అసెంబ్లీ రౌడీ.. ఈ పేరు చెప్పగానే మోహన్ బాబు హిట్ మూవీ గుర్తొస్తుంది. కాని ఇప్పుడీ టైటిల్ పవర్ స్టార్ మూవీకి యాప్ట్ అయ్యేలాఉంది. అయినా.. మోహన్ బాబు సినిమా టైటిల్‌ని పవన్‌కి వాడాల్సిన అవసరమేంటనే వాదన అవసరం లేదు. ఎందుకంటే అసెంబ్లీ రౌడీ టైటిల్‌ని కాని, ఆ కథని కాని పవన్ మూవీకి వాడట్లేదు. కాకపోతే ఈ టైటిల్ వెనకున్న ప్రచారం సంగతేంటంటే, సురేందర్ రెడ్డి తీయబోయే సినిమా అసెంబ్లీ రౌడీలాంటిదే. ఓ రౌడీ.. ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందని అసెంబ్లీ రౌడీ సినిమాలో చూపించారు.

కాని ఇక్కడ ఓ రౌడీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసే సామాన్యుడిగా పవన్ కనిపిస్తాడట. సురేందర్ రెడ్డి ప్లాన్ చేసిన మూవీ పొలిటికల్ సెటైర్‌గా రాబోతోంది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ ముఠామేస్త్రి మూల కథనే సురేందర్ రెడ్డి తీసుకున్నాడట. పూర్తిగా రీమేక్ కాకున్నా, ఆ పాయింట్‌తోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఓ మామూలు వ్యక్తి మంత్రై, ఆ తర్వాత పాలిటిక్స్‌ని కడిగేసే పాయింట్‌తో ఈమూవీని ప్లాన్ చేశాడట సురేందర్ రెడ్డి. సో.. ఏపీలో ఇప్పుడున్న సిచ్చువేషన్‌కి ఇది సరిపోతుంది కాబట్టే, వేగంగా పూర్తి చేసి.. కుదిరితే ఎలక్షన్స్ ముందు, లేదంటే మేలోగా వచ్చేలా చేయాలనేది సూరీ అండ్ టీం ప్లాన్ అని తెలుస్తోంది.

Published : 
  • 14 September 2023, 5:13 PM IST