Pawan Kalyan: శివ తాండవం కన్ఫామ్.. శివుడి అవతారం ఎత్తనున్న పవర్ స్టార్..

గతంలో ఓమైగాడ్‌ని గోపాల గోపాలగా రీమేక్ చేస్తే, పవనే గోపాలుడిగా కనిపించాడు. విక్టరీ వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుుడు ఓ మైగాడ్ 2 రీమేక్‌కి కూడా వెంకీ సై అన్నాడట. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటమే బాకీ అంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 12 October 2023, 5:34 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శివుడి అవతారం ఎత్తనున్నాడు. శివ తాండవం చేయబోతున్నాడు. ఆ కాన్సెప్ట్‌తో సినిమా సెట్స్‌పైకెళ్ళబోతుంది. ఆల్ మోస్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్దం చేశాడట. గుంటూరు కారం షూటింగ్‌తో బిజీ అయిన త్రివిక్రమ్, ఇటు పవన్ తాలూకు కొత్త ప్రాజెక్ట్ పనులు కూడా చూసుకుంటున్నాడట. పవన్ ప్రజెంట్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్‌కి కాల్ షీట్స్ ఇచ్చాడు.

కొత్త షెడ్యూల్స్‌తో తను మరో రెండు నెలలు ఈ సినిమాల షూటింగ్స్‌తోనే బీజీ అవుతాడు. ఆ తర్వాత ఏపీ ఎలక్షన్స్.. ఆ వెంటనే హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ పెండింగ్ షూటింగ్.. ఇలా ప్లాన్ చేసుకున్నాడు. ఐతే, త్రివిక్రమ్ మాత్రం ఓ మై గాడ్ 2 సీక్వెల్ తెలుగు రీమేక్ మ్యాటర్‌ని పవన్ చెవిలో వేశాడట. గతంలో ఓమైగాడ్‌ని గోపాల గోపాలగా రీమేక్ చేస్తే, పవనే గోపాలుడిగా కనిపించాడు. విక్టరీ వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుుడు ఓ మైగాడ్ 2 రీమేక్‌కి కూడా వెంకీ సై అన్నాడట. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటమే బాకీ అంటున్నారు. ఐతే గతంలో ఓమైగాడ్‌కి గోపాల గోపాల రీమేక్ అయినట్టే, ఓమై గాడ్ 2 కూడా హిట్ అయితే అది కూడా తెలుగులో రీమేక్ అవుతుందని ప్రచారం జరిగింది. అదే ఇప్పుడు నిజమౌతోంది.

పవన్ నుంచి సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ రావటంతో త్రివిక్రమ్ ఈ రీమేక్‌కి కథనం, మాటలు రాస్తున్నాడట. జనవరి 26కి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. దర్శకుడు ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదట. గోపాల గోపాల తీసిన దర్శకుడికే ఛాన్స్ ఇస్తారా..? కొత్త డైరెక్టర్ సీన్‌లోకొస్తాడో దీపావళి తర్వాత తేలనుంది.

Published : 
  • 12 October 2023, 5:34 PM IST