Power Star: పవన్‌ OG అప్‌డేట్‌ వచ్చేసిందోచ్..

ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకయాలతో.. పవన్ కల్యాణ్ బిజీబిజీగా కనిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్‌ మూవీస్‌లో OG ఒకటి. రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన సుజిత్.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ కొట్టాడు. సెకండ్‌ అటెంప్ట్‌గా ప్రభాస్‌తో సాహో తీశాడు. పేరొచ్చినా.. అది అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుజిత్‌.. పవన్ కల్యాణ్‌తో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయింది.

Post Published By: Srikar Creator
Updated : 9 April 2023, 7:40 PM IST

ఇక ఈ సినిమా వర్కింగ్ ఓజీ.. అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. ఐతే ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారా.. లేదా వేరే ఏమైనా టైటిల్ పెడతారా అనేది క్లారిటీ లేదు. ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అప్డేట్‌ను అందించారు మేకర్స్. పవన్ కల్యాణ్‌తో మొదటి షెడ్యూల్‌నే భారీ యాక్షన్ పార్ట్‌తో స్టార్ట్ చేయనున్నట్టుగా సమాచారం. ఈ షెడ్యూల్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ తర్వాతనే తెలుస్తోంది. ఓజీ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Published : 
  • 9 April 2023, 7:40 PM IST