PAWAN KALYAN: పవన్ పాట పాడితే.. పవర్ ఫుల్ కిక్కే..

తన ప్రతీ మూవీలో కనీసం ఓ జానపదమో, చిన్న పల్లవో పాడటం పవన్ ఓ పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఓజీలో కూడా అదే పనిచేస్తున్నాడు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లేదంటే ఓజాస్ గంభీరగా తెరకెక్కుతున్న సుజీత్ ఓజీ మూవీలో పవన్ పాట పాడబోతున్నాడట.

Post Published By: narender Thiru
Updated : 17 January 2024, 5:58 PM IST

PAWAN KALYAN: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన కెరీర్‌లో జానీ సినిమాలో ఓ పాట పాడాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆ పాట తూటాలా జనాల్లోకి దూసుకెళ్లింది. అంతకుముందు తమ్ముడులో తాటిచెట్టెక్కలేవంటూ గొంతు సవరిస్తే, అదో సెన్సేషన్ అయ్యింది. అత్తారింటికి దారేది మూవీలో కాటమరాయుడా అనే పాట పాడితే అదో ట్రెండ్ అయిపోయింది. ఆ తర్వాత తోటి హీరోలు కూడా గొంతులు సవరించే ట్రెండ్ మొదలైంది.

TOLLYWOOD: టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్స్ ఎక్కువయ్యాయా..? ఎందుకీ దొంగ లెక్కలు..

ఈ ట్రెండ్ కొత్త కాకున్నా, తన ప్రతీ మూవీలో కనీసం ఓ జానపదమో, చిన్న పల్లవో పాడటం పవన్ ఓ పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఓజీలో కూడా అదే పనిచేస్తున్నాడు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లేదంటే ఓజాస్ గంభీరగా తెరకెక్కుతున్న సుజీత్ ఓజీ మూవీలో పవన్ పాట పాడబోతున్నాడట. ఇది మరాఠీ ఫోక్ సాంగ్ అని తెలుస్తోంది. గతంలో ఖుషీ మూవీలో ఒరియా పాట రంగబోతి పాట పాడాడు పవన్. ఇప్పుడు ఓజీ మూవీ ముంబై బ్యాక్ డ్రాప్‌లో ప్లాన్ చేయటంతో మరాఠా ఫోక్ సాంగ్ పాడబోతున్నాడట. దసరాకు ఓజీ మూవీ విడుదలయ్యేలా ఫిల్మ్ టీం ప్లాన్ చేస్తోంది.

50శాతం పూర్తైన షూటింగ్‌ని రెండు నెలలుల్లో.. అంటే ఏప్రిల్ ఎండ్ నుంచి జూన్‌లోగా పూర్తిచేయాలి అనుకుంటున్నాడట సుజిత్. ఇక మరాఠా పాటను పవన్‌తో పాడించి, అలా ప్రమోషన్ మొదలు పెట్టి ఫ్యాన్స్‌లో‌ పూనకాలు తెప్పించాలనుకుంటున్నాడట.

Published : 
  • 17 January 2024, 5:58 PM IST