Premalu OTT: తెలుగులో డబ్ అయిన మలయాళం మూవీ ప్రేమలు. ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం గత నెల 8న తెలుగులో విడుదలైంది. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. తెలుగులోనూ మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తమిళ, కన్నడ, మలయాళంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో చిత్రం స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగులో ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Trivikram-Jr NTR: ఈసారి ఫిక్స్.. బర్త్ డేకి.. ‘ఎన్టీఆర్-త్రివిక్రమ్’ బిగ్ అప్డేట్
ఏప్రిల్ 12 నుంచి ఆహా ఓటీటీలో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంటుందని ఆహా ప్రకటించింది. గెట్ రెడీ ఫర్ మోడర్న్ లవ్ ఫీస్ట్ అంటూ పేర్కొంది. ‘ప్రేమలు’ సినిమాలో నెల్సన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. ఏడీ గిరీశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లతో కలిసి ఫహాద్ ఫాసిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.మలయాళంలో రూపొందినప్పటికీ ఈ సినిమా ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే తెరకెక్కింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ ఉండటంతో తెలుగు ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయింది.
కేవలం రూ. 5కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్లు సాధించి సరికొత్త రికార్డు సాధించింది. తెలుగులోనూ దాదాపు 20 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ విడుదల చేశారు. రాజమౌళి ప్రమోషన్ కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. చిత్రం థియేట్రికల్ రన్ దాదాపు ముగియడంతో ప్రేక్షకులు ఓటీటీలో విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో 12న సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Eeeeeeyyyyooooo! 🥳
— ahavideoin (@ahavideoIN) April 7, 2024
The much-loved movie, 'ప్రేమలు' is coming to aha!!
So guys, get ready for a modern love feast... 💕#Premalu Premieres April 12@BhavanaStudios @shyammeyyy pic.twitter.com/sO2WJDRO6g