Producer: బలగం హిట్టైనందుకు.. బాధపడుతున్న దిల్ రాజు..

బలగం మూవీ ఏరేంజ్ లో హిట్టైందో అందరికి తెలిసిందే. ఇక లాస్ ఏంజిల్స్ నుంచి యూరప్ వరకు చాలా చోట్ల ఈసినిమాకు అవార్డుల పంట పండుతోంది. ఇక థియేటర్స్ లో కూడా వసూళ్ల వర్షం కురుస్తూనే ఉంది. సో నిర్మాత దిల్ రాజు నుంచి దర్శకుడు వేణు వరకు అంతా సంబరపడాలి.. కాని బాధపడుతున్నారు. హిట్ ఎందుకు వచ్చిందా అని చింతించాల్సి వస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 3 April 2023, 8:00 PM IST

బలగం మూవీ ఎంతగా జనాల్లోకి చొచ్చుకెళ్లిందంటే, రాజమౌళి మూవీ కూడా అంతగా ఊరూర, ప్రతీ పల్లె, అన్నీ వాడల్లోకి పోలేదు. కానీ బలగం మూవీ చొచ్చుకెళ్లింది. భావోద్వేగాలు, కదిలించే సీన్లు బలగం మూవీని జనం ఓన్ చేసుకునేలా చేసింది. అంతవరకు బానే ఉంది. కానీ బలగం మూవీని ఒక్కొక్కరు తన ఇంట్లో ఉన్న హోమ్ థియేటర్ ని వీధిలో పెట్టి వాడలో జనాలందరికి సినిమాని ఫ్రీగా చూపిస్తున్నారట.

కొందరైతే తెల్లటి గోడ దగ్గర హోమ్ ప్రొజెక్టర్లు పెట్టడం, గుడిలో పెద్ద స్క్రీన్ పెట్టి సినిమాను ఫ్రీగాచూపించటం చేస్తున్నారట. ఓటీటీలో ఎకౌంట్ ఉన్న ఒక్కరు తమ వరకే కాక వాడ వాడకి ఈమూవీని ఫ్రీ గా చూపించటంతో, థియేటర్స్ కి వెళ్లేవాళ్లు తగ్గుతున్నారు.

ఇక కొందరైతే పైరసీ సైట్లలో ఉన్న మంచి క్వాలిటీ బలగం మూవీని చిన్న ప్రొజెక్టర్స్ ద్వారా గోడల మీద ప్రొజెక్ట్ చేస్తూ సినిమా చూపిస్తున్నారు. దిల్ రాజు అండ్ టీం పోలీసులని సంప్రదించినా,వాళ్లు మాత్రం ఎంతఘనం ఆపగలిగే ఛాన్స్ ఉంది.. దీంతో బలగం అంతగా జనాల్లోకి వెళ్లిందని సంతోషపడాలో, వసూళ్లు రాక ఫ్రీ షోలే పడిపోతున్నాయని బాధపడాలో తెలియట్లేదు.

Published : 
  • 3 April 2023, 8:00 PM IST