PUSHPA 3: ఈ సినిమాల సీక్వెల్స్ వస్తున్నాయా.. పబ్లిసిటీ స్టంటా..?

పుష్ప 3 ఉంటుందని ఆమధ్య జర్మనీ ఫిల్మ్ ఫెస్టివల్లో బన్నీ హింట్ ఇచ్చాడు ఓకే. చాలా ఐడియాస్ ఉన్నాయి. ఖచ్చితంగా పుష్ప 3 ఉంటుందన్నారు. కాని ఇది పుష్ప 2 మీద అంచనాలు పెంచే ప్రయత్నమే అనుకోవాల్సి వస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 6 March 2024, 8:22 PM IST

PUSHPA 3: సీతారామం 2, పుష్ప 3, ఈ రెండూ కూడా గాలి బుడగలేనా? ఈ డౌట్ రావటానికి కారణం సుకుమార్‌తో రామ్ చరణ్ మూవీ ఆల్‌మోస్ట్ ఓకే అవటం, ప్రభాస్‌తో హనురాఘవపూడి సినిమా పూర్తవటానికి కనీసం మూడేళ్ళ టైం పట్టే అవకాశం ఉండటమే. పుష్ప 3 ఉంటుందని ఆమధ్య జర్మనీ ఫిల్మ్ ఫెస్టివల్లో బన్నీ హింట్ ఇచ్చాడు ఓకే. చాలా ఐడియాస్ ఉన్నాయి. ఖచ్చితంగా పుష్ప 3 ఉంటుందన్నారు.

MEGASTAR CHIRANJEEVI: పాత హిట్ సినిమాల బాటలోనే చిరు అండ్ కో.. భలే ప్లాన్..!

కాని ఇది పుష్ప 2 మీద అంచనాలు పెంచే ప్రయత్నమే అనుకోవాల్సి వస్తోంది. ఇక్కడితో పుష్ప సీక్వెల్స్ పూర్తవుతుందంటే పెద్దగా ఆసక్తి ఉండదు. అదే మూడో సీక్వెల్ ఉంటుందంటే ఆ అంచనాలు వేరు. ఈ సినిమాతో కలిసి ట్రావెల్ అయ్యే ఆడియన్స్ లెక్కవేరు. అందుకే త్రిబుల్ ఆర్ 2, బాహుబలి 3 ఎలాగైతే ఉంటాయో అంటూ ఊరిస్తూ కేవలం మాటలకే వాటిని పరిమితం చేశారో.. అలానే పుష్ప 3కి మాటలవరకే పరిమితం చేసేలా ఉన్నారు. సీతారామం సీక్వెల్ కూడా అలాంటిదే అంటున్నారు. ఇదేనా ఇంకా సలార్ 3 కూడా ఉందంటున్నారు. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్‌తో మూడో మూవీ ప్లాన్ చేశాడంటున్నారు. ఇవన్నీ జనాల్లో క్రేజ్‌ని పెంచేలా అటెన్షన్ లాక్కునే ప్రయత్నాలంటున్నారు.

ఇక సీతారామం సీక్వెల్ మీదా నెలకోరకంగా గాసిప్స్ పెరగటానికి కారణం మరో రెండేళ్ల వరకు ప్రభాస్ మూవీతోనే దర్శకుడు హను రాఘవపూడి బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి తను తీసిన సీతారామం సీక్వెల్ ప్రచారం తన కొత్త మూవీకి మీద, తన మీద అటెన్షన్ లాక్కునే ప్రయత్నమే అంటున్నారు

Published : 
  • 6 March 2024, 8:22 PM IST