TARAKARATNA: తారకరత్నకు ఫొటోకు ముద్దుపెట్టి కన్నీళ్లు.. వాలెంటైన్స్‌ డే రోజు అలేఖ్య రెడ్డి ఏం చేశారంటే..

తారకరత్నకు వాలెంటైన్స్‌ డే విషెస్‌ చెప్తూ.. అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేసిన ఓ వీడియో.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓ ఫ్లవర్‌ బొకేను.. తారకరత్న ఫొటో ముందు పెట్టి అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యారు.

Post Published By: narender Thiru
Updated : 14 February 2024, 6:40 PM IST

TARAKARATNA: నందమూరి తారకరత్న మరణం తర్వాత.. ఆయన భార్య గురించి, ఆయన పిల్లల గురించి.. ప్రపంచానికి తెలిసింది. ఇంత మంచి ఫ్యామిలీని డిస్టర్బ్‌ చేశావ్‌.. ఇదేం పని దేవుడా అంటూ.. తారకరత్న భార్య, పిల్లల ఫొటోలు చూసి.. చాలామంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

YS JAGAN: టీడీపీ మైండ్‌బ్లాంక్‌ అయ్యేలా వైసీపీ మేనిఫెస్టో.. జగన్ ఇవ్వబోయే కొత్త హామీలు ఇవే !

తారకరత్న ఇక లేడు అని తెలిసి.. ఆయన భార్య అలేఖ్యారెడ్డి పెట్టిన కన్నీళ్లు అన్నీ ఇన్నీ కావు. ఆయన మరణం తర్వాత.. చాలా నెలలకు కానీ నార్మల్ అవలేదు ఆమె ! ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తోంది. తండ్రి లేని లోటు లేకుండా పిల్లలకు ప్రేమ పంచుతోంది. తారకరత్న, అలేఖ్యారెడ్డిది లవ్ మ్యారేజ్‌. ఆమెను పెళ్లి చేసుకునేందుకు... తారకరత్న కుటుంబాన్ని కూడా ఎదురించారనే ప్రచారం ఉంది. కుటుంబాన్ని కాదు అనుకొని మరీ.. అలేఖ్యను పెళ్లి చేసుకున్నారు. తారకరత్న చనిపోయే వరకు.. ఆయన పేరెంట్స్‌ కూడా ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంది అందుకే అనే ప్రచారం జరిగింది. అలాంటి ప్రేమ జంటను చూసి దేవుడికి కళ్లు కుట్టాయ్ అనుకుంటా.. తారకరత్నను దూరం చేశాడు.

TDP NO RAJYASABHA : వాళ్ళని నమ్ముకొని పోటీయా ? ఈసారి రాజ్యసభ వద్దనుకున్న బాబు

ఐతే తారకరత్నకు వాలెంటైన్స్‌ డే విషెస్‌ చెప్తూ.. అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేసిన ఓ వీడియో.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓ ఫ్లవర్‌ బొకేను.. తారకరత్న ఫొటో ముందు పెట్టి అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఆ ఫొటోను ముద్దు పెట్టుకొని.. హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత భర్తతో కలిసి గతంలో దిగిన ఫొటోలు యాడ్ చేశారు. ఫొటో ముందు పిల్లలందరితో కలిసి దిగిన ఫొటోనూ కూడా ఈ వీడియోలో పెట్టారు. దీనికి డార్లింగ్‌ మూవీ బీజీఎం యాడ్‌ చేసిన అలేఖ్యా రెడ్డి.. సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రేమికుల దినోత్సవం వేళ.. ఈ వీడియో అభిమానులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ కుటుంబానికి తారకరత్నను దూరం చేసిన దేవుడు.. పిల్లల కోసం మంచి భవిష్యత్ రాసి పెట్టి ఉంటాడని కొందరు.. అలేఖ్యా రెడ్డి బాధను మాటల్లో వర్ణించడం కూడా సాధ్యం కావడం లేదంటూ మరికొందరు.. ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. దీంతో అలేఖ్యారెడ్డి పోస్టింగ్ వైరల్ అవుతోంది.
https://youtu.be/ihByAKrnd0Q

Published : 
  • 14 February 2024, 6:40 PM IST