ఉస్తాద్ భగత్ సింగ్ పై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఎక్కువగా రీమేక్ లే ఉంటాయి. పవన్ కెరీర్ స్లో అయిన సమయంలో తెలుగు డైరెక్టర్ లు రాసిన కథల కంటే పవన్ కళ్యాణ్... రీమేక్ సినిమాలనే నమ్ముకుని హిట్ కొడుతూ ఉంటారు.

Post Published By: Vencateshg
Updated : 26 October 2024, 7:20 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఎక్కువగా రీమేక్ లే ఉంటాయి. పవన్ కెరీర్ స్లో అయిన సమయంలో తెలుగు డైరెక్టర్ లు రాసిన కథల కంటే పవన్ కళ్యాణ్... రీమేక్ సినిమాలనే నమ్ముకుని హిట్ కొడుతూ ఉంటారు. ఈ విషయం ఫ్యాన్స్ కు చెప్తే కోపం వస్తుంది గాని వాస్తవం మాత్రం అదే. వరుస ఫ్లాప్ ల తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ చేసిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ స్పీడ్ అందుకున్నారు. ఆ తర్వాత అత్తారింటికి దారేది మాత్రం రీమేక్ కాదు.

కాని కొన్ని సీన్స్ మాత్రం కాపీ చేసారనే వార్తలు వచ్చాయి. ఇక మూడు నాలుగు సినిమాల ఫ్లాప్ తర్వాత భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి సినిమాలను పవన్ రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ ను మళ్ళీ గాడిలో పెట్టింది. ఇప్పుడు ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి హరిహర వీరమల్లు, రెండు ఉస్తాద్ భగత్ సింగ్, మూడు ఓజీ. ఈ మూడు సినిమాలు ఎప్పుడో మొదలుపెట్టినా ఇప్పుడు ఇంకా షూట్ పూర్తి కాలేదు, ఓ వైపు రాజకీయాలు మరో వైపు సినిమాలు అంటూ పవన్ బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంది.

వచ్చే ఏడాది హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేస్తామని దసరా రోజున ప్రకటించినా... నమ్మకం మాత్రం రావడం లేదు. ఇక ఓజీ షూట్ కూడా త్వరలోనే మొదలు కానుంది కంప్లీట్ గా. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరిస్థితి ఏంటీ అనేదే ఫ్యాన్స్ లో ఉన్న టెన్షన్. తాజాగా ఈ సినిమాకు రచయితగా ఉన్న డైరెక్టర్ దశరథ్ సంచలన కామెంట్స్ చేసారు. గతంలో ఈయన మాట్లాడుతూ ఈ సినిమా తమిళ హీరో విజయ్ చేసిన తేరీ సినిమా రీమేక్ అని చెప్పారు. ఆ కథను తెలుగులో తీస్తున్నామని అన్నారు.

కాని ఇప్పుడు ఇది రీమేక్ కాదని అన్నారు. ముందు భవదీయుడు భగత్ సింగ్ అనుకున్నామని కాని తర్వాత మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేసామని చెప్పారు. దీనితో ఫ్యాన్స్ కి మైండ్ పోతుంది. అసలు ఏం చేస్తున్నార్రా పవన్ కళ్యాణ్ తో అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక సినిమా షూట్ కోసం ఇటీవల పవన్ ను కలిసినా... ఆయన ఎప్పుడు షూట్ కు వస్తారో క్లియర్ కట్ గా నిర్మాతలకు క్లారిటీ ఇవ్వలేదు.

Published : 
  • 26 October 2024, 7:20 PM IST