“మ్యాన్ ఆఫ్ మాసెస్” రెబల్ రహస్యం.. సైలెంట్ గా…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని బన్నీ ఫాలో అవుతున్నాడన్నారు. కాసేపు రెబల్ స్టార్ ప్రభాస్ స్ట్రాటజీని ఐకాన్ స్టార్ కాపీ కొడుతున్నారనంటున్నారు.

  • Written By:
  • Publish Date - January 28, 2026 / 03:50 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని బన్నీ ఫాలో అవుతున్నాడన్నారు. కాసేపు రెబల్ స్టార్ ప్రభాస్ స్ట్రాటజీని ఐకాన్ స్టార్ కాపీ కొడుతున్నారనంటున్నారు. నిజం చెప్పాలంటే, వాళ్లలానే బన్నీకి కూడా రెండు పాన్ ఇండియా హిట్లొచ్చాయి..తనకంటూ పాన్ ఇండియా లెవల్లో సెపరేట్ మార్కెట్ ఉంది.. కాని ప్రభాస్ కి, ఎన్టీఆర్ కి పడ్డ పంచులు తనకి పడకుండా ఉండాలంటే, వాళ్ల ఫార్ములానే బన్నీ ఫాలో అవ్వాలా? అందుకు సీక్రెట్ గా చాలా విషయాల్లో ఎన్టీఆర్, ప్రభాస్ ప్రాజెక్టులు ఎగరేసుకుని పోయే ప్రయత్నం అల్లు అర్జున్ చేశాడా? లోకేష్ కనకరాజ్ తో సినిమా, సందీప్ రెడ్డి తో మూవీ అలా ఎగరేసుకెళ్లినవే అనంటున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన ప్రాజెక్టుని అలానే ఎగరేసుకుపోయే ప్రయత్నం చేశాడన్నారు.. ఇందులో నిజమెంత? స్పిరిట్ తర్వాత యానిమల్ సీక్వెల్ ఉందని రణ్ బీర్ కపూర్ చెప్పాల్సిన అవసరమేమొచ్చింది? దీనితో ఎన్టీఆర్ ప్రాజెక్టుకి సందీప్ కి ఏమైనా లింకుందా? అవన్నీ తెలిసే, బన్నీ వరుస పెట్టి ఎనౌన్స్ మెంట్లు ఇప్పిస్తున్నాడా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడు.. తన స్టోరీ సెలక్షన్ బాగుంటుంది… ఇది ఇండస్ట్రీలో తనకున్న ఇమేజ్… ప్రభాస్ రెండు సినిమాలు చేస్తే, మూడు సినిమాలు క్యూలో పెడతాడు.. ఇది పాన్ ఇండియా లెవల్లో తన స్ట్రాటజీ.. ఈరెండూ నచ్చే అటు ఎన్టీఆర్, ఇటు ప్రభాస్ ని అడుగడుగునా ఫాలో అవుతున్న అల్లు అర్జున్ అన్నారు.నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశముదురే… పాన్ ఇండియా లెవల్లో పుష్పరాజ్ గా 1600కోట్ల పైనే వసూళ్లను రుచి చూసినా స్టారే.. అలాంటి తనకి ఎన్టీఆర్, ప్రభాస్ ప్లానింగ్స్ ని కాపికొట్టాల్సిన అవసరమో, ఫాలో అయ్యే పరిస్థితో ఉండదు. కాని ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ మరోలా ఉంది. లోకేష్ కనకరాజ్ తో బన్నీ సినిమా ప్లానింగ్ అంతా సైలెంట్ గా జరిగింది. ఎక్కడ ఎన్నడూ చిన్న రూమర్ కూడా రాలేదు.

ఆల్ ఆఫ్ సడన్ గా లోకేష్ తో అల్లు అర్జున్ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. కట్ చేస్తే, టీ సీరీస్ అధినేత, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ తర్వాత బన్నీ మూవీనే తెరకెక్కుతుందని తేల్చాడు.. ఇక్కడ కూడా అంతా సీక్రెట్ గానే జరిగింది.. ఎందుకంత సీక్రసీ.. ఇక్కడే బన్నీ ఎవరిని, ఎందుకు ఫాలో అయ్యాడో తెలిసిపోతోందన్న మాట వినిపిస్తోంది.నిజానికి సందీప్ రెడ్డి వంగ ఎప్పుడో బన్నీతో అర్జున్ రెడ్డి మూవీ తీయాలి… కాని తనకు సబ్జెక్ట్ కనెక్ట్ కాలేదని వదిలేశాడు.. సీన్లోకి రౌడీ స్టార్ వచ్చి హిట్ కొట్టాడు. కట్ చేస్తే తర్వాతైనా సందీప్ కి బన్నీ ఆఫర్ ఇచ్చాడా అంటే లేదు…దీంతో కబీర్ సింగ్ తీసి హిందీలో హిట్ కొట్టిన సందీప్ తర్వాత కథని మహేశ్ కి చెప్పాడు.. అది పట్టాలెక్కలేదు… కాని అదే కథ బన్నీకి చెబితే నో అన్నాడట… కట్ చేస్తే యానిమల్ వచ్చింది…

దానిరెస్పాన్స్ చూశాక బన్నీ లో కదలిక మొదలవ్వలేదు… సందీప్ వెల్లి ఎన్టీఆర్ కి కథ చెప్పగానే, ఉన్న ఫలంగా సందీప్ రెడ్డి వంగతో, బన్నీ తన మూవీ ఎనౌన్స్ చేయించాడు. కట్ చేస్తే మళ్లీ ఈ కాంబినేషన్ ఎనౌన్స్ మెంట్ కే పరిమితమైంది… కట్ చేస్తే మళ్లీ సందీప్ రెడ్డి వెల్లి ఎన్టీఆర్ కి కలిశాడో లేదో, ఇంతలో టీసీరీస్ అదినేత బన్నీతో సందీప్ మూవీ అని ఎనౌన్స్ చేశాడు..లోకేష్ కూడా నిజానికి కూలీ ప్లాప్ తర్వాత సూర్యని, ఎన్టీఆర్ ని కళిశాడు.. వాళ్లలో సూర్యా ఆ కథని రిజెక్ట్ చేస్తే, ఎన్టీఆర్ మాత్రం హోల్డ్ లో పెట్టాడు.. అది తెలిసే, సైలెంట్ గా బన్నీ ఇలా లోకేష్ కనకరాజ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడట.. సో ఇవన్నీ చూస్తుంటే, ఎన్టీఆర్ ఏం ప్రాజెక్టులు చేస్తున్నాడు..? ఎవరితో చేస్తున్నాడనే విషయంలో బన్నీ టీం చాలా పెద్ద రెక్కీనే చేస్తోందన్న ప్రచారం కనిపిస్తోంది.