Navdeep: నవదీప్ అరెస్ట్‌తో మళ్లీ డ్రగ్స్ కేసు ఆట మొదలవుతుందా?

రీసెంట్‌గా డ్రగ్ డీల్ దొరకడం, తనకి నటుడు నవదీప్‌తో లింకుందని తేలటంతో, నార్కోటిక్స్ వేట మొదలు పెట్టింది. నవదీప్ మాత్రం బెయిల్ కోసం ట్రై చేస్తే కోర్టు షాక్ ఇచ్చింది. ఏదేమైనా నవదీప్‌తో మొదలైన ఇన్వెస్టిగేషన్ ఈసారి గట్టిగా జరిగేలా ఉంది.

Post Published By: narender Thiru
Updated : 20 September 2023, 5:54 PM IST

Navdeep: టాలీవుడ్‌ని డ్రగ్స్ కేసు ఎంతగా కుదిపేసిందో గతంలో చూశాం. పూరీ నుంచి టాలీవుడ్ టాప్ స్టార్స్ వరకు అంతా పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టారు. పొద్దున వెళితే సాయంత్రం వరకు ఇంటరాగేషన్‌ని ఫేస్ చేశారు. అలా ఒక్కో స్టార్‌తో.. ఒక్కో రోజు.. ఇలా సాగింది విచారణ. మీడియాకు పండగ, ఇండస్ట్రీకి నరకం ఇలా ఒకే సారి రెండు సినిమాలు రన్ అయ్యాయి.

మళ్లీ ఆ రోజులు రాబోతున్నాయి. రీసెంట్‌గా డ్రగ్ డీల్ దొరకడం, తనకి నటుడు నవదీప్‌తో లింకుందని తేలటంతో, నార్కోటిక్స్ వేట మొదలు పెట్టింది. నవదీప్ మాత్రం బెయిల్ కోసం ట్రై చేస్తే కోర్టు షాక్ ఇచ్చింది. ఏదేమైనా నవదీప్‌తో మొదలైన ఇన్వెస్టిగేషన్ ఈసారి గట్టిగా జరిగేలా ఉంది. గతంలో ఎవరైతే ఇన్వెస్టిగేషన్‌ని ఫేస్ చేశారో, వాళ్లకు సంబంధించిన పేరు ఒక్కటైనా ఈసారి మళ్లీ బయటకు వస్తే జైలుకే అంటున్నారు. నవదీన్ స్నేహితులు, ఎక్కువగా తనతో రీసెంట్‌గా నటించిన వాళ్లు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోవటం చూస్తే.. ఇదేదో భారీ వ్యవహారంలానే కనిపిస్తోంది.

ఇక రాను రాను మరింత మంది నటుల ఫోన్లు స్విచ్చాఫ్ అవటం చూస్తామేమో. విచిత్రం ఏంటంటే ఈ సారి ఎక్కువగా బుల్లితెర నటులు, వెబ్ సీరీస్‌లతో బిజీ అయిన నటుల పేర్లే ఎక్కువగా వచ్చేలా ఉన్నాయి. వాళ్లే ఎక్కువగా ఫోన్లు స్విచ్చాఫ్ చేసిపెట్టడం, లాంటి వార్తలతో సీన్ మారేలా ఉంది.

Published : 
  • 20 September 2023, 5:54 PM IST