Urvashi Rautela: టాలీవుడ్ టాప్ స్టార్స్‌ని టార్గెట్ చేసిన ఊర్వశీ రౌటేలా

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎన్ని హీరోయిన్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పిన ఊర్వశి.. తెలుగులో ఐటమ్ గాల్ సాంగ్స్‌కే ప్రయారిటీ ఇవ్వటానికి రెమ్యునరేషనే కారణం. కేవలం ఒక వారం రోజుల్లో తెరకెక్కే ఐటమ్ సాంగ్స్‌లో మెరిస్తే 2 నుంచి 5 కోట్లు ముట్టచెబుతున్నారు తెలుగు నిర్మాతలు.

Post Published By: narender Thiru
Updated : 6 December 2023, 8:41 PM IST

Urvashi Rautela: బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా టాలీవుడ్‌నే టార్గెట్ చేస్తోంది. ఇక్కడ పెద్ద హీరోలనే లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా హైదరాబాద్‌లోనే తిష్ట వేసేందుకు ఇక్కడ ఫ్లాట్ కూడా తీసేసుకుంది. అందుకు తగ్గట్టే చిరు, బాలయ్య, నాగ్‌తోపాటు బన్నీ మూవీల్లో ఆఫర్స్ పట్టేస్తోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎన్ని హీరోయిన్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పిన ఊర్వశి.. తెలుగులో ఐటమ్ గాల్ సాంగ్స్‌కే ప్రయారిటీ ఇవ్వటానికి రెమ్యునరేషనే కారణం.

Pooja Hegde: పూజాని అందుకే పట్టించుకోవడం లేదా..?

కేవలం ఒక వారం రోజుల్లో తెరకెక్కే ఐటమ్ సాంగ్స్‌లో మెరిస్తే 2 నుంచి 5 కోట్లు ముట్టచెబుతున్నారు తెలుగు నిర్మాతలు. అందుకే తమిళ, కన్నడ, మలయాళం ఆఫర్స్ ఉన్నా, తెలుగులో ఎవరైనా ఆఫర్ ఇస్తే చాలు, వాటిని కాదని టాలీవుడ్ ప్రాజెక్ట్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తోంది. తెలుగులో దక్కేంత పారితోషికం తమిళ, మలయాళ, కన్నడ చిత్రసీమలో దక్కట్లేదు. అంతేకాదు తెలుగులోనే ఎక్కువ పాన్ ఇండియా మూవీలు తెరకెక్కుతున్నాయి. రూ.100 నుంచి 300 కోట్ల బడ్జెట్ మూవీలు తెరకెక్కేది ఎక్కువ శాతం తెలుగులోనే కాబట్టి ఇలా చేస్తున్నట్టుంది. మెగాస్టార్ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీలో ఊర్వశీ రౌటేలా నాగకన్యగా స్పెషల్ సాంగ్ చేయనుందట. ఆల్రెడీ వాల్తేర్ వీరయ్యలో బాస్ పార్టీ సాంగ్ చేసింది.

ఇక బాబీతో బాలయ్య చేసే మూవీలో ఊర్వశీ స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయ్యింది. ఇక నాగ్.. నా సామిరంగలో ఐటమ్ సాంగ్ మీద ప్రచారం పెరిగింది. అయితే పుష్ప 1లో ఊ అంటావా సాంగ్‌లో మెరిసే ఛాన్స్ మిస్ చేసుకున్న తను.. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ఆఫర్‌ని మాత్రం పట్టేసిందని తెలుస్తోంది. ఇలా టాలీవుడ్‌లో టాప్ హీరోలే టార్గెట్‌గా దూసుకెళుతోంది ఊర్వశి.

Published : 
  • 6 December 2023, 8:41 PM IST