Biker Tatyana Ozolina died : రష్యా మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ భామ దుర్మరణం..

రష్యా (Russia) దేశంలోని ప్రముఖ పాపులర్ రష్యన్ ఇన్ ఫ్లుయెన్సర్, మోస్ట్ బ్యూటీఫుల్ బైకర్ (most beautiful biker) గా పేరొందిన టాట్యానా ఓజోలినా(38) దుర్మరణం చెందారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 July 2024, 2:00 PM IST

మృత్యువు ముందు తన కళ ఓడిపోయింది.. తన ప్యాషనే తనకు మృత్యువైంది. ఏంటి అర్థం కాలేదా..?

ప్రపంచంలో మహిళలు ఉన్నత విద్యలు అభ్యసించి.. అగ్రస్థానంలో ఉంటారు. కొందరు రాజకీయాల్లో రాణిస్తే.. మరి కొంతరు తన అందంతో నటనలతో రంగస్థలంపై అలరిస్తుంటారు. మరి కొందరు బిజినెస్ లో ఎవరు ఎదగలేని ఎత్తుకు వెళ్తుంటారు. కానీ మహిళలు చాలా వరకు బైకర్ గా అవ్వడం చాలా చాలా అరుదుగా జరుగుంది. అందులోను బైక్స్ రేసింగ్ చేసి.. స్టంట్స్ చేసి రికార్డులు నిలపడం మరో ఎత్తు.. అలాంటి వ్యక్తి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం..

రష్యా (Russia) దేశంలోని ప్రముఖ పాపులర్ రష్యన్ ఇన్ ఫ్లుయెన్సర్, మోస్ట్ బ్యూటీఫుల్ బైకర్ (most beautiful biker) గా పేరొందిన టాట్యానా ఓజోలినా(38) దుర్మరణం చెందారు. టర్కీలో ఆమె బైక్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆమె తన BMW S1000RR 2015 సూపర్ బైక్‌పై వెళ్తుండగా నియంత్రణ కోల్పోయి మిలాస్ సమీపంలో ట్రక్కును ఢీకొన్నారు. టర్కిలో బైకర్ టథియానా ఓజోలినా ప్రమాదంలో తన మెడకు బలమైన గాయం అయ్యి సృహ కోల్పోయింది. దీంతో ఘటనా స్థలంలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ వచ్చేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో రష్య దేశం ఒక మంచి లేడి బైకర్ ని కొల్పోయిందని ఆవేదన చేందుతున్నారు. దీంతో ఆమె ఆకస్మిక మరణం పట్ల ఆండ్రీ ఇవనోవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలియన్ల మంది ప్రజలు ఆమెను ఫాలో అయ్యారు.. ఎన్నో అవార్డులను పొందింది. ఇప్పుడు ఆమె మన మధ్య లేదు.. ఆమె జ్ఞాపకాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయని తెలిపారు.

ఓజోలి నాకు మంచి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. మిలియన్ల కొంది ఫ్యాన్స్ ఆమెను ఫాలో అయ్యారు. టిక్ టాక్ లో ఐదు మిలియన్న మంది ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ లో రెండు మిలియన్లు, ఇన్స్టాగ్రామ్ లో సుమారుగా ఒక మిలియన్ మంది ఆమెను ఫాలో అవుతున్నారు.

Suresh SSM

 

 

 

 

 

 

 

Published : 
  • 25 July 2024, 2:00 PM IST