Pawan Kalyan : పవన్ తో విసుగెత్తారా ?.. నిర్మాతలు, డైరెక్టర్లు లబో దిబో..

పవన్‌ కల్యాణ్‌తో డైరెక్టర్స్‌,నిర్మాతలు విసిగిపోయారా? పైకి చెప్పలేకపోతున్నా.. లోలోన మధన పడిపోతున్నారా? మూడేళ్ల నుంచి పవన్‌ నే నమ్ముకుంటున్నా.. షూటింగ్‌ పూర్తి కావడం లేదు. పవన్ సినిమా అంటే.. డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌కు కష్టాలు తప్పడం లేదు. పవన్‌తో సినిమా అంటే డైరెక్టర్‌కు క్రేజ్‌ వస్తుంది.. ప్రొడ్యూసర్‌కు ఈజీగా బిజినెస్‌ అయిపోతుంది. పవన్‌ డేట్స్‌ ఇవ్వడని తెలిసినా ఆయనే కావాలంటారు. కానీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. ఆరు నెలల్లో పూర్తయ్యే సినిమా ఎంత ఆలస్యం అయినా.. 10 నెలలు పడుతుంది.. మహాఅయితే ఏడాదిలో పూర్తి చేసేయొచ్చని నిర్మాతలు బరిలోకి దిగితే.. యేళ్ళు గడిచిపోతున్నాయి. బడ్జెట్‌తో పోటీగా.. వడ్డీలు పెరిగిపోయి.. తడిసి మోపెడు అవుతోంది.

Post Published By: dialnews
Updated : 10 December 2023, 11:42 AM IST

Published : 
  • 10 December 2023, 11:42 AM IST

Exit mobile version