బ్రేకింగ్: బండి సంజయ్ అరెస్ట్

పోలీస్ వాహనం దిగి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎంట్సన్స్ వద్ద రోడ్డుపై మళ్లీ బైఠాయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవో 29పై ప్రభుత్వం నుండి ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు బండి సంజయ్.

Post Published By: Vencateshg
Updated : 19 October 2024, 4:18 PM IST

పోలీస్ వాహనం దిగి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎంట్సన్స్ వద్ద రోడ్డుపై మళ్లీ బైఠాయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవో 29పై ప్రభుత్వం నుండి ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు బండి సంజయ్. బండి సంజయ్ తో కలిసి రోడ్డుపైనే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ బైఠాయించారు. బండి సంజయ్ రక్షణగా వేలాది మంది నిరుద్యోగులు నిలవడం హైలెట్.

ఇక తీవ్ర ఉద్రిక్తత నడుమ ‘చలో సెక్రటేరియట్’ ర్యాలీ కొనసాగగా పోలీసులు అడుగడుగునా అడ్డం నిలిచారు. నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేసారు. బండి సంజయ్ అరెస్ట్‌ నేపథ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్రతోపులాట చోటు చేసుకోగా భారీ ఎత్తున బలగాలు మొహరించాయి. ఇక బండి సంజయ్ కు దాసోజు శ్రవణ్ మద్దతు తెలిపారు.

Published : 
  • 19 October 2024, 4:18 PM IST