బ్రేకింగ్:వంగవీటి రాధకు గుండెపోటు

టీడీపీ నేత వంగవీటి రాధ గుండెపోటుకి గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.

Post Published By: Vencateshg
Updated : 26 September 2024, 11:32 AM IST

టీడీపీ నేత వంగవీటి రాధ గుండెపోటుకి గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. యాంజియో చేసిన అనంతరం స్టెంట్ వేసిన డాక్టర్లు... రాధను వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిందిగా సూచించారు. ఇక రాధ ఆరోగ్యంపై ఎటువంటి వందంతులు నమ్మవద్దని, ఆందోళన లేదని పేర్కొన్నారు. రాధకు గుండెపోటు అని తెలియడంతో ఆసుపత్రికి భారీగా ఆయన అభిమానులు భారీగా తరలి వస్తున్నారు.

2004 లో రాధ తొలిసారి ఎమ్మెల్యే కాగా ఆ తర్వాత ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లోనే ఉన్నా రాధ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. గత ఏడాది రాధ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Published : 
  • 26 September 2024, 11:32 AM IST