Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆస్తులెన్ని.. అప్పులెన్ని.. అఫిడవిట్‌‌తో తేలిందేంటి..

అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి తన ఆస్తులు, ఆప్పులు, తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొన్నారు. రేవంత్ తన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రఆయనపై 89 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో ఎక్కడా దోషిగా తేలలేదు. రేవంత్ వద్ద రెండు తుపాకులు, రెండు కార్లు ఉన్నాయి.

Post Published By: narender Thiru
Updated : 9 November 2023, 8:35 PM IST

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) రెండు చోట్ల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న కొండంగల్ నుంచి, అలాగే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కూడా ఆయన గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి తన ఆస్తులు, ఆప్పులు, తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొన్నారు. రేవంత్ తన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రఆయనపై 89 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

BRS, KTR : బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. ప్రచార వాహనం నుంచి కింద పడ్డ మంత్రి కేటీఆర్..

ఈ కేసుల్లో ఎక్కడా దోషిగా తేలలేదు. రేవంత్ వద్ద రెండు తుపాకులు, రెండు కార్లు ఉన్నాయి. రెండు వాహనాల్లో ఒకటి హోండా సిటీ కారు, రెండోది మెర్సిడిస్ బెంజ్ కారు. వీటిలో ఒకటి సెకండ్ హ్యాండ్ కారు. వ్యక్తిగత, కుటుంబ ఆస్తుల్లో భాగంగా రేవంత్ రెడ్డి దగ్గర.. రూ.5,34,000 నగదు ఉంది. రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత పేర్ల మీద కలిపి ఉన్న స్థిర, చరాస్తుల అన్నిటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30.95 కోట్లుగా వివరించారు. ఇంకా రేవంత్ వద్ద రూ.2 లక్షల విలువ చేసే పిస్టల్ ఒకటి, రూ.50 వేల విలువ చేసే మరో రైఫిల్ ఉన్నాయి. రేవంత్, ఆయన భార్య గీత పేరు మీద మొత్తం కలిపి రూ.1,30,19,901 మేర అప్పులు ఉన్నాయి.

రేవంత్ భార్య దగ్గర 1,235 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ.83,36,000గా ఉంది. రేవంత్ భార్య గీత వద్ద రూ.7,17,800 విలువైన 9,700 గ్రాముల వెండి, వెండి వస్తువులు కూడా ఉన్నాయి.

Published : 
  • 9 November 2023, 8:35 PM IST