దంచికొట్టిన బట్లర్, ఇంగ్లాండ్ దే రెండో టీ ట్వంటీ

కరేబియన్ టూర్ లో వన్డే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ టీమ్ టీ ట్వంటీల్లో మాత్రం దుమ్మురేపుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ విండీస్ ను చిత్తు చేసింది.

Post Published By: Vencateshg
Updated : 11 November 2024, 5:00 PM IST

కరేబియన్ టూర్ లో వన్డే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ టీమ్ టీ ట్వంటీల్లో మాత్రం దుమ్మురేపుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ విండీస్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ ను 158 పరుగులకే ఇంగ్లీష్ బౌలర్లు కట్టడి చేశారు. కెప్టెన్ రోవ్ మన్ పావెల్ 43 రన్స్ తో రాణించాడు. ఛేజింగ్ లో ఫిల్ సాల్ట్ తొలి బంతికే ఔటైనా...జాస్ బట్లర్ దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ విల్ జాక్స్ తో కలిసి రెండో వికెట్ కు 12.1 ఓవర్లలోనే 129 పరుగులు జోడించాడు. ఫలితంగా ఇంగ్లాండ్ 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Published : 
  • 11 November 2024, 5:00 PM IST