వాళ్లకు పబ్లిసిటీ కావాలి. వీళ్ళకి డబ్బులు కావాలి. విద్యార్థులు ఏమైపోయినా....? వాళ్ల భవిష్యత్తులో ఎలా తగలబడినా వాళ్లకి వీళ్ళకి అనవసరం. సంచలనం సృష్టిస్తున్న వైల్డ్ వైలెన్స్, బోల్డ్ సెక్స్ మూవీ టాక్సిక్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ని మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్వహించడం, కేవలం స్టూడెంట్స్ ని మాత్రమే ఆ ఫంక్షన్ కి ఆహ్వానించడం.... కాలేజీ మేనేజ్మెంట్ స్వయంగా వేదికలెక్కి తైతక్కలాడడం... టీవీల్లో చూస్తున్న వాళ్ళందరికీ జుగుప్త కలిగించింది.టాక్సిక్ సినిమా పిల్లలు చూడొద్దు. స్టూడెంట్స్ అసలే చూడొద్దు అని ఆ సినిమా హీరోయే స్వయంగా ఎక్కడ వీలైతే అక్కడ ఘనంగా చెప్పుకొస్తున్నాడు. సినిమాలో రొమాన్స్ పేరిట బూతు ఎక్కువైందని.... అగ్లీ కంటెంట్ అవధులు దాటిపోయిందని... ట్రైలర్లు టీజర్లు చూసిన వాళ్ళందరూ చెబుతున్నారు. వైలెన్స్ కూడా విపరీతంగా ఉందని... స్వయంగా హీరోయే ప్రకటించాడు.
ఇలాంటి సినిమాకి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ మల్లారెడ్డి విద్యాసంస్థల ప్రాంగణంలో జరిపించి అదేదో సోషల్ సర్వీస్ చేసినంతగా ఆ సంస్థల చైర్మన్ మల్లారెడ్డి, డైరెక్టర్ ప్రీతి రెడ్డి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఖర్చులు కలిసి వస్తాయి కదా అని చెప్పి టాక్సిక్ తెలుగు రైట్స్ తీసుకున్న నిర్మాత దిల్ రాజు ఫ్రీగా వచ్చిన మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్లో... ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాడు.హీరో రాఖీ బాయ్ కి స్థానికంగా పెద్ద ఫ్యాన్స్ ఎవరూ ఉండరు. సిటీలో ఇక్కడ పెట్టిన పెద్దగా జనం రారు. అందుకే తెలివిగా దిల్ రాజు మల్లారెడ్డి కలిసి స్టూడెంట్స్ ని బలి చేశారు. విద్యార్థులు
చూడకూడని.... బూతు, వైలెన్స్ ఏ సర్టిఫికెట్ సినిమాని కాలేజీ క్యాంపస్ లో నిర్వహించి అసలు ఏం మెసేజ్ చేద్దాం అనుకున్నారు మల్లారెడ్డి ,ప్రీతి రెడ్డి. ఫంక్షన్ మధ్యలో స్టాండ్లు కూలి పలువురు స్టూడెంట్స్ గాయపడ్డారు. తొక్కిసలాట జరిగింది.
మరి కొంతసేపు.... స్టూడెంట్స్... అరుపులు కేకలతో నానా యాగి చేశారు. వాళ్లని కంట్రోల్ చేస్తున్నట్టుగా...., ప్రీతి రెడ్డి కాసేపు స్టేజ్ పై వాల్యూస్ గురించి స్పీచ్ దంచారు.అసలు సినిమా ఫంక్షన్స్ కి.... కాలేజీలకి ఏంటి సంబంధం. ఆ ఫంక్షన్ కి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు. సినిమా ఫంక్షన్స్ కి బూతు సినిమా హీరోలు, హీరోయిన్లు రావడం ఏంటి? టాక్సిక్ సినిమా ప్రమోషన్ భారాన్ని మల్లారెడ్డి, ప్రీతి రెడ్డి భుజాలకు ఎత్తుకోవడం ఏమిటి? ప్రీతి రెడ్డి తన పిల్లలను తీసుకొని సినిమాకి వెళ్లగలరా? కుటుంబంలో కలిసి ఇలాంటి సినిమా చూడగలరా? తాను చూడ లేని సినిమా ప్రమోషన్ తన కాలేజీలో ఎలా ఇస్తారు? అంటే కాలేజీ స్టూడెంట్స్ చెడిపోయిన పర్వాలేదు. తమ కాలేజీకి పేరు రావాలి. బ్రాండ్ డెవలప్ అవ్వాలి. ఎవడు ఎలా పోయినా పర్వాలేదు? పిల్లలు స్టూడెంట్స్ సినిమా చూడొద్దు అని ఒకపక్క చెప్తూనే పిల్లలకి స్టూడెంట్స్ కి కాలేజీ గ్రౌండ్లో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్మాత దిల్ రాజు ఎలా నిర్వహిస్తారు? ఫ్రీగా కాలేజీ గ్రౌండ్.... కరెంటు దొరికాయి కనక ఎవడు ఎలా పోయినా పర్వాలేదు. ఇది దిల్ రాజు ప్రిన్సిపుల్. విద్యాసంస్థల్లో సినిమా ఫంక్షన్లకి పర్మిషన్ ఎలా ఇచ్చారు? పోలీసులకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా.?
వీటన్నిటికీ మించి అంత పెద్ద విద్యాసంస్థలు నిర్వహిస్తూ చైర్మన్ హోదాలో ఉండి మల్లారెడ్డి వేసే బఫూన్ వేషాలు జనానికి జుగుప్స కలిగించాయి. విద్యా సంస్థకు చైర్మన్ అంటే ఎలా ఉండాలి? నేను పాలు అమ్ముకున్న ,పూల అమ్ముకున్న అంటే సరిపోతుందా? పిల్లల ముందు హీరోని ఫోటోలు కోసం బతిమిలాడుకోవడం ఏంటి? మామూలుగానే మల్లారెడ్డి పాలిటిక్స్ లో బఫూన్ క్యారెక్టర్. చివరికి తన విద్యార్థులు ముందే తాను చిల్లర వేషాలేసి అభాస పాలయ్యాడు మల్లారెడ్డి.ఏది ఏమైనా మున్ముందు సినిమా ఫంక్షన్లో కాలేజీ గ్రౌండ్లో పెట్టకుండా నిషేధిస్తే మంచిది. పైగా బూతు, వైలెన్స్ ఉన్న సినిమాలు కళాశాలలో ఎలా ప్రమోట్ చేస్తారు? ఈ విషయాన్ని మల్లారెడ్డి సంస్థల నిర్వాహకులు మరోసారి ఆలోచించాలి.