సాంస్కృతిక కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఏపూరి రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటూ వచ్చారు. తన సొంత నియోజకవర్గం తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రత్యేక తెలంగాణగా ఏర్పడిన తరువాత.. తెలంగాణ ఆశయాలు నెరవేరలేదంటూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు.
