డకౌట్లలో గిల్ రికార్డ్ యువఓపెనర్ పై మీమ్స్

టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తో సిరీస్ లో దుమ్మురేపుతాడనుకుంటే తొలి టెస్టులో డకౌటయ్యాడు. ఈ డకౌట్ తో ఒక చెత్త రికార్డును కూడా గిల్ మూటగట్టుకున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 19 September 2024, 7:12 PM IST

టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తో సిరీస్ లో దుమ్మురేపుతాడనుకుంటే తొలి టెస్టులో డకౌటయ్యాడు. ఈ డకౌట్ తో ఒక చెత్త రికార్డును కూడా గిల్ మూటగట్టుకున్నాడు. ఓ క్యాలెండెర్ ఇయర్‌లో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు డకౌటైన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ చేరాడు. ఇంగ్లండ్‌తో హైదరాబాద్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో, రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు. తాజాగా చెన్నై టెస్టులోనూ డకౌటవడంతో చెత్త రికార్డు అందుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో గిల్ పై మీమ్స్ మొదలయ్యాయి. ప్రిన్స్ మామూలోడు కాదని, డకౌట్లలోనూ రికార్డులే అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

Published : 
  • 19 September 2024, 7:12 PM IST